News November 22, 2025
ఉమ్మడి KNR డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ

తెలంగాణలోని పలు జిల్లాల కాంగ్రెస్ పార్టీ DCC అధ్యక్షుల జాబితాను AICC జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లా- చొప్పదండి MLA మేడిపల్లి సత్యం, పెద్దపల్లి జిల్లా – రామగుండం MLA రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, జగిత్యాల జిల్లా – గాజేంగి నందయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా – సంగీతం శ్రీనివాస్‌లకు కాంగ్రెస్ అధిష్ఠానం అవకాశం కల్పించింది. వీరికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు.
Similar News
News November 23, 2025
యథావిధిగా అమలాపురంలో ‘పీజీఆర్‌ఎస్’ : కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈ నెల 24 సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లో, అలాగే ఆర్డీవో కార్యాలయాలు, మండల స్థాయిలో ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని కలెక్టర్ కోరారు.
News November 23, 2025
KMR: రైలు ఢీకొని 80 గొర్రెల మృతి.. కాపరి గల్లంతు

కామారెడ్డి రైల్వే ట్రాక్ సమీపంలో ఆదివారం రైలు ఢీకొని సుమారు 80 గొర్రెలు మృతి చెందాయి. రైలు రాకను గమనించి వాటిని కాపాడుకునే ప్రయత్నంలో గొర్రెల కాపరి సురేష్ పెద్ద వాగులోకి దూకారు. అయితే, ఆయనతో పాటు ఉన్న మరో కాపరి, 35 ఏళ్ల ధర్షపు సుధాకర్, ఈత రాకపోవడంతో వాగులో గల్లంతయ్యారు. సుధాకర్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 23, 2025
సిరిసిల్ల డీఎస్పీగా నాగేంద్ర చారి నియామకం

సిరిసిల్ల సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా కే.నాగేంద్ర చారి నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. నిజామాబాద్ సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్న నాగేంద్ర చారిని సిరిసిల్లకు బదిలీ చేశారు. నాగేంద్ర చారి గతంలో వేములవాడ డీఎస్పీగా విధులు నిర్వర్తించారు.


