News February 6, 2025
ఉమ్మడి MBNR జిల్లాలో రైతు భరోసా జమ.!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాకు 78,403 రైతులకు గాను రూ.38,15,09,916 జమయ్యాయి. NRPTకు 45,717 రైతులకు గాను రూ.26,94,06,431, NGKLకు 78,490 రైతులకు గాను రూ.44.79.99.371 జమయ్యాయి. వనపర్తి జిల్లాకు 60,239 రైతులకు గాను రూ.28,02,01,581, గద్వాలకు 37,352 రైతులకు గాను రూ.23,86,06,138 అధికారులు జమ చేశారు.
Similar News
News November 6, 2025
KNR: ‘పైసలిస్తేనే పని’.. కార్మిక శాఖలో ఓపెన్ దందా..!

కార్మిక శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. దళారులు, అధికారులు కలిసి సామాన్యుడిని దోచుకుంటున్నారు. డెత్ క్లైమ్‌కు రూ.50,000, పెళ్లికి రూ.10,000 ముందు చెల్లిస్తేనే ఖాతాల్లో డబ్బు జమవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా, ఇందుకు ఏజెంట్లు, బ్రోకర్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి KNR కార్మిక శాఖలో లేబర్ కార్డ్ నమోదు నుంచి వివాహకానుకలు, అంగవైకల్యం, డెత్ క్లైమ్ల వరకు ప్రతిపనికి ఓ RATE ఫిక్స్ అయ్యుంది.
News November 6, 2025
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: టిప్పర్ యజమాని

మీర్జాగూడ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని <<18186628>>టిప్పర్<<>> యజమాని లక్ష్మణ్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బస్సు డ్రైవర్ వేగంగా వస్తూ గుంతను తప్పించబోయి మాపైకి దూసుకొచ్చాడు. వెంటనే డ్రైవర్ ఆకాశ్ నన్ను నిద్రలో నుంచి లేపాడు. క్షణాల్లోనే బస్సు మా టిప్పర్‌ను ఢీకొట్టింది. మా డ్రైవర్ మద్యం తాగి వాహనం నడిపాడని, గుంతను తప్పించబోయి బస్సును ఢీకొట్టాడని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు’ అని తెలిపారు.
News November 6, 2025
రంపచోడవరం అటా.. ఇటా?

ప్రభుత్వం కొత్తగా రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటుకు సన్నద్ధమౌతున్న వేళ రంపచోడవరం సమస్య తెరపైకి వచ్చింది. నియోజకవర్గం 2 డివిజన్‌లతో మొత్తం 12 మండలాలను కలిగి ఉంది. వీరు పాడేరు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో తమను పత్యేక జిల్లాగా ప్రకటించాలని కొందరు, తూ.గో.లో కలపాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ ప్రతిపాదనలతో పాటు ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకు ఆలోచిస్తన్నట్లు సమాచారం.


