News August 11, 2024
ఉమ్మడి NZB జిల్లాల్లోని నేటి ముఖ్యాంశాలు

*నిజామాబాద్‌లో అంబరాన్నంటిన బంజారా తీజ్ ఉత్సవాలు
*NZBలో వ్యక్తి అదృశ్యం.. బాసరలో మృతదేహం లభ్యం
*రైల్లో భారీగా నల్ల బెల్లం పట్టివేత
*షబ్బీర్ అలీని కలిసిన నిఖత్ జరీన్
*ఆర్మూర్: పిచ్చికుక్కల దాడి.. ఏడుగురికి గాయాలు
*భార్య కళ్ళ ముందే భర్త ఆత్మహత్య
*రుద్రూర్: నూతన గ్రామ పంచాయతీగా కొండాపూర్
*నిజాంసాగర్:చెరువులో పడి యువకుడు మృతి
Similar News
News February 14, 2026
దుబాయిలో నందిపేట మండల యువకుడి మృతి

నందిపేట మండలం లక్కంపల్లికి చెందిన పస్క రాజు(27) దుబాయ్‌లో మరణించారు. స్థానికుల వివరాల ప్రకారం.. రాజు తండ్రి మరణించడంతో కుటుంబ భారాన్ని మోస్తూ పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ రాజు హఠాన్మరణం చెందారు. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చేలా ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు.
News February 14, 2026
NZB: మేయర్ పీఠం కోసం వారి ఓట్లే కీలకం

NZB నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్, ఎంపికలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఇందు కోసం MP, MLA, MLCలు తమకు ఓటు ఉన్న జిల్లా పరిధిలో ఎక్స్అఫీషియో సభ్యుడి ఓటరుగా ఉండేందుకు ఛాన్స్ ఉంది. దీంతో BJPకి చెందిన MP, NZB(U), ARMR MLAలతో పాటు ఇద్దరు MLCలు, కాంగ్రెస్‌కు చెందిన NZB(R), BDN MLAలతో పాటు జిల్లాకు చెందిన MLC మహేశ్ కుమార్ గౌడ్ ఓట్లు నమోదు చేసుకోనున్నారు.
News February 14, 2026
NZB: 18 నుంచి 14కు తగ్గిన MIM సీట్లు

2020లో నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో 18 సీట్లను గెలుచుకున్న AIMIM 2026 ఎన్నికల్లో 14 సీట్లను గెలుచుకుంది. AIMIM అభ్యర్థులు పోటీ చేసిన కొన్ని డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడమే దీనికి కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. గత పాలక వర్గంలో ఉన్న షకీల్ హైమద్, మహ్మద్ ఇద్రీస్ ఖాన్‌లు వరుసగా 52, 55వ డివిజన్లలో గెలుపొందడం గమనార్హం.


