News March 17, 2025

ఉయ్యాలవాడ పేరు పెట్టాలని వినతి

image

ఓర్వకల్ విమానాశ్రయానికి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉయ్యాలవాడ పేరు పెట్టాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.

Similar News

News March 17, 2025

కర్నూలు జిల్లాలో తొలిరోజే ఇద్దరు డీబార్

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. మొదటి రోజే తెలుగు పరీక్షకు 700 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జొన్నగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చూచిరాతకు పాల్పడిన ఓ విద్యార్థిని ఆర్జెడీ డీబార్ చేశారు. కర్నూలు సీఆర్ఆర్ మున్సిపల్ పాఠశాలలో చూచిరాతకు పాల్పడిన విద్యార్థిని డీఈవో శామ్యూల్ పాల్ గుర్తించారు. ఆ విద్యార్థిని సైతం డీబార్ చేయగా.. జొన్నగిరిలో టీచర్‌ను సస్పెండ్ చేశారు.

News March 17, 2025

కర్నూలు: నేలపైనే పరీక్షలు రాశారు..!

image

కర్నూలు జిల్లాలో సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరైన వసతులు కల్పించలేదని విద్యార్థులు ఆరోపించారు. 270 మంది విద్యార్థులు నేలపైనే కూర్చొని పరీక్ష రాశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా.. కనీసం బెంచీలు ఏర్పాటు చేయలేదు. రేపటి పరీక్షకు బెంచీలు ఏర్పాటు చేస్తామని MEO సత్యనారాయణ చెప్పారు.  

News March 17, 2025

అర్జీలు స్వీకరించిన కర్నూలు కలెక్టర్

image

అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా జాయింట్ కలెక్టర్ నవ్యతో కలిసి ఆయన వినతులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలను క్లోజ్ చేసేటపుడు వ్యక్తిగతంగా అర్జీదారులతో మాట్లాడి, అర్జీలకు పరిష్కారం ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

error: Content is protected !!