News September 3, 2025

ఉయ్యూరు: లైన్‌మెన్‌పై బూతు పురాణం

image

ఉయ్యూరు పెద్దఓగిరాల కరెంట్ సబ్-స్టేషన్ లైన్‌మెన్ నాగరాజును లైన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ బూతులు తిట్టిన ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కరివేపాకు తీసుకురమ్మని లైన్‌మెన్‌కి చెప్పారు. వేరే పని ఉండటం వల్ల తేలేకపోయానని చెప్పడంతో ఫోన్‌లో లైన్‌మెన్‌పై అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Similar News

News September 4, 2025

వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్దాం: మోదీ

image

దేశ ఉత్పత్తుల వినియోగంతో దేశ రూపురేఖలు మారుతాయని PM మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. స్వదేశీ వస్తు వినియోగం, మేడిన్ ఇండియాను విద్యార్థి దశలోనే నేర్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. ‘వోకల్ ఫర్ లోకల్ నినాదం మరింత ముందుకు తీసుకెళ్లాలి. దేశీయ ఉత్పత్తులు వాడుతున్నామని అందరూ గర్వపడాలి. గాంధీజీ నినాదం కూడా స్వదేశీ.. దాన్ని అందరం పాటించాలి. స్వదేశీ డే, స్వదేశీ వీక్‌ను పండుగగా నిర్వహించుకోవాలి’ అని పిలుపునిచ్చారు.

News September 4, 2025

టోకెన్ పద్ధతిలో యూరియా పంపిణీ: కలెక్టర్

image

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ టీఎస్ చేతన్ అధ్యక్షతన యూరియా మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ-క్రాప్ నమోదు ఆధారంగా టోకెన్ పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పంటలు సాగుచేసిన వివరాలు, ఆ పంటలు జాబితా వాటికి అవసరమయ్యే యూరియా మోతాదును డివిజన్, మండల, రైతు సేవ కేంద్రాల వారిగా నమోదు చేసుకోవాలన్నారు.

News September 4, 2025

ఎన్టీఆర్: లా విద్యార్థులకు అలెర్ట్

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో LL.B 2, 4వ సెమిస్టర్(2024-25 విద్యా సంవత్సరం) థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు అక్టోబర్ 13, 27 నుంచి నిర్వహిస్తామని..పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 26లోపు ఫీజు చెల్లించాలని ANU పరీక్షల విభాగం సూచించింది. ఫీజు వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలంది.