News April 20, 2025
ఉరవకొండ: తమ్ముడి పెళ్లి చూపులకు వెళ్తుండగా విషాదం

ఉరవకొండలో ఆదివారం విషాద ఘటన జరిగింది. పట్టణానికి చెందిన ప్రవల్లిక తన తమ్ముడి వివాహ నిశ్చయం కోసం భర్త మల్లికార్జునతో కలిసి బైక్‌పై వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని కళ్యాణ మండపం వద్ద ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
Similar News
News April 20, 2025
నంద్యాల జిల్లా నేటి ముఖ్యాంశాలు

∆శ్రీశైలంలో కర్ణాటక బస్సుకు తప్పిన పెను ప్రమాదం
∆ఆత్మకూరులో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
∆నిరుపేదలకు వైద్యం అందించాలనేది లక్ష్యం: MP
∆డోన్‌లో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా
∆నరసింహ స్వామి ఆలయంలో మంత్రి బీసీ ప్రత్యేక పూజలు
∆హోటల్ యజమానులకు ఆళ్లగడ్డ సీఐ హెచ్చరికలు
∆ఆత్మకూరులో రోడ్లపైనే నిలిచిన నీరు
News April 20, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ వెల్దుర్తి: ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి
☞ వినుకొండ: ఒంగోలు జాతి ఎడ్ల బండ్ల ప్రదర్శన
☞ ఎడ్లపాడు: అక్రమ మైనింగ్ చేస్తున్న 3JCBలు,18 ట్రాక్టర్లను సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు
☞ చిలకలూరిపేట: ర్యాలీలో మాజీ మంత్రి విడుదల రజనీకి పోలీసులకు మధ్య వాగ్వాదం
☞ నరసరావుపేట: అగ్నిమాపక వారోత్సవాలు
☞ పెదకూరపాడు: సమాధుల తోటలో ఈస్టర్ ప్రార్థనలు
News April 20, 2025
పెద్దపల్లి: రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. భూభారతి కొత్త ఆర్ఓఆర్ రెవెన్యూ చట్టం అమలు నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నందున ఈ సోమవారం ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కావున జిల్లా ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.