News December 28, 2024
ఉరవకొండ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
ఉరవకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉండగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయని, దీంతో రాకపోకలు స్తంభించి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని టీడీపీ మండల కార్యదర్శి గోవిందు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు 16 మందిపై కేసు నమోదైంది.
Similar News
News December 29, 2024
ఇంటి పట్టాలు పంపిణీ చేసిన విప్ కాలవ శ్రీనివాసులు
బొమ్మనహాల్ మండలంలోని గోనేహాళ్ గ్రామంలో శనివారం ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పర్యటించారు. కళ్యాణదుర్గం ఆర్డీవో వసంత బాబు, తుంగభద్ర ప్రాజెక్ట్ వైస్ ఛైర్మన్ కేశవరెడ్డితో కలిసి 75 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాల పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని ఆయన తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు వివరించారు.
News December 28, 2024
అనంతపురం జేఎన్టీయూ పరిధిలో ఫలితాలు విడుదల
అనంతపురం జేఎన్టీయూ పరిధిలో అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించిన ప్రీ పీహెచ్‌డీ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.
News December 28, 2024
మన్మోహన్ సింగ్.. శ్రీ సత్యసాయి బాబా భక్తుడు
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బాబా దర్శనం కోసం వచ్చేవారు. 2010లో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ 29వ కాన్విగేషన్ సర్టిఫికెట్ల ప్రదానం కార్యక్రమానికి ఆయన అతిథిగా వచ్చారు. అనంతరం 2011లో సత్యసాయి బాబా మరణించిన రోజు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. 2016లో సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు.