News April 20, 2025

ఉర్కొండ: వివాహితపై అత్యాచారం.. సీన్ రీ కన్స్‌ట్రక్షన్

image

ఉర్కొండ మండలంలో మార్చి 29న పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో జరిగిన వివాహిత అత్యాచారం కేసులో డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రెండో రోజు సీను రీ కన్స్‌ట్రక్షన్ చేశారు. అత్యాచార సమయంలో నిందితులు ఉపయోగించిన వస్తువులను వారి ఇంటి వద్దకు వెళ్లి సేకరించారు. నిందితుల నుంచి వాహనం, కొంత డబ్బు, వారి వ్యక్తిగత వస్తువులను సీజ్ చేశామని డీఎస్పీ పేర్కొన్నారు.

Similar News

News December 13, 2025

రాంగ్ రూట్‌లో వెళ్లకండి: ప్రకాశం పోలీసులు

image

ప్రకాశం జిల్లాలోని వాహనదారులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఐటీ విభాగం పోలీసులు కీలక సూచనలు చేశారు. కొద్ది దూరమని రాంగ్ రూట్ ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. దూరం కంటే ప్రాణం ముఖ్యమనే విషయాన్ని వాహనదారులు గమనించాలని కోరారు. రాంగ్ రూట్ వెళ్లకుండా వాహనదారులు సహకరించాలన్నారు.

News December 13, 2025

గర్భాశయం ఉంటేనే మహిళ: మస్క్

image

హ్యూమన్ జెండర్‌పై ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ షాకింగ్ ట్వీట్ చేశారు. ‘మీకు గర్భాశయం ఉంటే మీరు మహిళ అవుతారు. లేదంటే కాదు’ అని ట్వీట్ చేశారు. ఆయన మొదటి నుంచి హ్యూమన్ జెండర్ విషయంలో ఈ తరహాలోనే స్పందిస్తున్న విషయం తెలిసిందే. ‘మనుషుల్లో స్త్రీ, పురుషులు మాత్రమే ఉంటారు’ అని చెప్తూ ఉంటారు. LGBT వర్గాలను ఆయన మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే వస్తున్నారు.

News December 13, 2025

సాదా బైనామాలకు అఫిడవిట్లు తప్పనిసరి

image

TG: సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తుతోపాటు అఫిడవిట్లు దాఖలు చేయాలని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. భూ హక్కులపై వివాదాల దృష్ట్యా అఫిడవిట్లు ఉంటేనే అనుమతిస్తున్నారు. వివాదాలు తలెత్తినప్పుడు భూ హక్కులకోసం ఇచ్చే దరఖాస్తుల ధ్రువీకరణ నిలిపివేయాలని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 9.26 లక్షల దరఖాస్తులు రాగా వివాదాల వల్ల 10 శాతం ధ్రువీకరణా పూర్తికాలేదు.