News July 9, 2025
ఉల్లాస్-అక్షరాంద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: కలెక్టర్

అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉల్లాస్-అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బంగ్లాలో జిల్లాస్థాయి అధికారులతో కాన్ఫరెన్స్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. 100 గంటల శిక్షణతో ఈ ఏడాది 97,200 నిరీక్షరాశులను అక్షరాస్యులుగా తీర్చిదిద్ది ప్రథమ స్థానంలో ఉంచాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News July 9, 2025
త్వరితగతిన పనులను పూర్తి చేయాలి: సిరిసిల్ల కలెక్టర్

బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని వారు పరిశీలించి మాట్లాడారు. బ్రిడ్జిని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
News July 9, 2025
రాష్ట్ర వ్యాప్తంగా 8.81 లక్షల దరఖాస్తులు: పొంగులేటి

గత ప్రభుత్వంలో రైతులను కష్టపెట్టిన ధరణిని తొలగించి భూభారతి తీసుకువచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 8.81 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. రైతుల భూ సమస్యలు పరిష్కరించి సంపూర్ణ హక్కులు కల్పిస్తామన్నారు. న్యాయస్థానం విచారణలో ఉన్నవి మినహా అన్నింటికీ పరిష్కారం చూపుతామని పొంగులేటి పేర్కొన్నారు.
News July 9, 2025
ఘట్కేసర్ వాసుకి ఉత్కృష్ట సేవా పథకం

కేంద్ర ప్రభుత్వ ఉత్కృష్ట సేవా పతకం ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీ నగర్‌కు చెందిన గుండ్యా నాయక్‌ను వరించింది. విధి నిర్వహణలో 15 ఏళ్ల పాటు సేవ, అంకితభావంతో వృత్తి పరమైన నైపుణ్యంతో అనేక విజయాలు సాధించిన ఆయనను ఉత్కృష్ట సేవా పతకం 2025 వరించింది. ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.