News September 15, 2025
ఉల్లితో కూలిన ఆశలు!

కర్నూలు మార్కెట్ యార్డు ఉల్లి నిల్వలతో నిండిపోయింది. మరోవైపు ధరలు భారీగా పతనమయ్యాయి. ఆదివారం కిలో ఉల్లి ధర కేవలం 50 పైసలు. ఇక నాణ్యత లేదనే సాకుతో వ్యాపారులు క్వింటా రూ.50 నుంచి రూ.300 మించి కొనలేదు. ఉల్లి ధర ఇంతలా పతనం కావడం కర్నూలు చరిత్రలో ఇదే తొలిసారి. గతేడాది క్వింటా రూ.6వేల వరకు పలకడంతో ధర ఆశాజనకంగా ఉంటుందని రైతులు ఈ ఏడాది పెద్ద ఎత్తున సాగు చేశారు. ప్రస్తుత ధర వారికి కన్నీరు తెప్పిస్తోంది.
Similar News
News September 15, 2025
రాష్ట్ర స్థాయి అత్యపత్య పోటీలకు జిల్లా క్రీడాకారులు

కరీంనగర్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అత్యపత్య పోటీల్లో పాల్గొనేందుకు సిద్దిపేట జిల్లా క్రీడాకారులు సోమవారం బయలుదేరి వెళ్లారు. సిద్దిపేట జిల్లా అత్యపత్య అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో ఎంపికైన పురుష, మహిళా సీనియర్ క్రీడాకారులు ఈ పోటీలలో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా వారికి సిద్దిపేట స్పోర్ట్స్ కన్వీనర్ పాల సాయిరాం, కోచ్ మహేష్ శుభాకాంక్షలు తెలిపారు.
News September 15, 2025
విషాదం.. సెలవు అడిగిన 10 నిమిషాలకే

‘ఆరోగ్యం బాలేదు, సెలవు కావాలి’ అని అడిగిన 10 నిమిషాలకే ఓ ఉద్యోగి గుండె ఆగి మరణించాడు. ‘శంకర్(40) అనే కొలీగ్ సిక్ లీవ్ ఇవ్వాలని ఉ.8.37 గం.కు మెసేజ్ పెట్టగా, 8.47కు కార్డియాక్ అరెస్టుకు గురై చనిపోయారు. ఈ విషయం తెలిసి షాకయ్యాను. శంకర్‌కు ఎలాంటి దురలవాట్లు లేవు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం’ అని అతడి పై అధికారి అయ్యర్ ట్వీట్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఏ కంపెనీ? అనేది తెలియాల్సి ఉంది.
News September 15, 2025
ప్రెగ్నెన్సీలో డ్రైవింగ్.. సురక్షితమేనా?

చాలామంది గర్భిణులు ఉద్యోగం సహా ఇతర కారణాలతో ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. స్కూటీ, కారును వారే స్వయంగా నడుపుతుంటారు. అయితే డాక్టర్ సలహాతో, గుంతలు లేని రోడ్లపై నెమ్మదిగా డ్రైవింగ్ చేయాలి. నెలలు నిండే కొద్దీ బరువు పెరుగుతారు. కాబట్టి.. ఆ సమయంలో బ్రేక్ వేయటానికి, వాహనం బ్యాలెన్స్ చేయడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. వీలైనంత వరకు గర్భంతో ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయటం తగ్గించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.