News September 11, 2025

ఉల్లి రైతులను మోసగిస్తే కఠిన చర్యలు: కలెక్టర్, ఎస్పీ

image

కర్నూలు మార్కెట్ యార్డులో గురువారం ఉదయం లెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యటించారు. వివిధ ప్రాంతాల నుంచి రైతులు అమ్మకానికి తెచ్చిన ఉల్లి ఉత్పత్తులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం యార్డ్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. అమ్మకానికి వచ్చిన ఏ ఒక్క రైతుకూ నష్టం కలగకుండా వారికి సహకరించాలన్నారు. రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News September 12, 2025

13న కర్నూలులో జాతీయ లోక్ అదాలత్

image

ఈ నెల 13న కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్, ప్రీ-లిటిగేషన్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News September 11, 2025

కర్నూలు జిల్లా కొత్త కలెక్టర్ ఈమే!

image

కర్నూలు జిల్లా నూతన కలెక్టర్‌గా డా.అట్టాడ సిరి నియమితులయ్యారు. సెకండరీ హెల్త్ డైరెక్టర్‌గా ఉన్న ఆమెను జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కలెక్టర్ రంజిత్ బాషాను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.

News September 11, 2025

కర్నూలు జిల్లా కలెక్టర్ బదిలీ

image

రాష్ట్ర ప్రభుత్వం 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా బదిలీ అయ్యారు. జిల్లాకు నూతన కలెక్టర్‌గా ఎ.సిరి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.