News April 20, 2024
ఉషశ్రీ చరణ్ ఆస్తుల వివరాలు

ఉషశ్రీ చరణ్‌కు రూ.4.16 కోట్ల చరాస్తులు, రూ.1.54 కోట్ల స్థిరాస్తులున్నాయి. 5.27 కేజీల బంగారం, 78 కిలోల వెండి ఉంది. 2 క్రిమినల్ కేసులున్నాయి. భర్త శ్రీచరణ్ స్థిర,చరాస్తులు రూ.44.93, 1.607 కేజీల బంగారం, 48 కిలోల వెండి, ఓ బస్సు, ఇతర వాహనాలు ఉన్నాయి. 2019 అఫిడవిట్ ప్రకారం ఉష స్థిర,చరాస్తులు రూ.1.52కోట్లు, 4.150 కేజీల బంగారం ఉంది. ఆమె భర్త స్థిర, చరాస్తులు రూ.7.61కోట్లు. 1.5కేజీల బంగారం ఉంది.
Similar News
News November 3, 2025
పెడపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

పుట్టపర్తి మండలం పెడపల్లి వద్ద సోమవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ రంగాను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. వారిని ఢీ కొన్న కారు ధర్మవరం వైపు వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 3, 2025
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 105 పిటిషన్లు: ఎస్పీ

అనంతపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 105 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పిర్యాదు దారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
News November 3, 2025
తరచూ బాలల సంరక్షణా కేంద్రాలను తనిఖీ చేయాలి: జేసీ

జిల్లాలో ప్రస్తుతం ఉన్న బాలల సంరక్షణా కేంద్రాలను సంబంధిత శాఖ అధికారులు తనిఖీ చేయాలని జేసీ శివ్ నారాయణన్ శర్మ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బాలల సంరక్షణ కేంద్రాల జిల్లా స్థాయి సిఫారసు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ చైర్‌పర్సన్ రాజ్యలక్ష్మి, ఐసీడీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాలల సంరక్షణా కేంద్రాలలో బాలలకు సక్రమంగా పౌష్టిక ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు.


