News April 2, 2024

ఉష్ణోగ్రతల్లో రాష్ట్రంలోనే మల్లాపూర్ టాప్

image

జగిత్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. సోమవారం మల్లాపూర్ మండల కేంద్రంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో మల్లాపూర్ రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఉదయం తొమ్మిది దాటితే భానుడు భగ్గుమంటున్నాడు. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజు రోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు.

Similar News

News April 22, 2025

కరీంనగర్ జిల్లాలో ఎక్కడెక్కడ ఎంత ఎండ..

image

కరీంనగర్ జిల్లాలో ఎండ దంచికొడుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా మానకొండూర్ మండలంలో 43.5°C నమోదు కాగా, జమ్మికుంట 43.4, గంగాధర 43.2, తిమ్మాపూర్ 43.0, కరీంనగర్ 42.8, గన్నేరువరం 42.7, వీణవంక, కరీంనగర్ రూరల్ 42.6, రామడుగు, చిగురుమామిడి 42.5, హుజూరాబాద్, కొత్తపల్లి 42.4, ఇల్లందకుంట 42.3, శంకరపట్నం 42.2, చొప్పదండి 41.5, సైదాపూర్ 40.1°C గా నమోదైంది.

News April 22, 2025

కరీంనగర్: తేలనున్న 35,562 మంది భవితవ్యం

image

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు నేడు విడుదల చేయనుంది. KNR జిల్లాలో మొత్తం 35,562 మంది పరీక్షలు రాశారు. ప్రథమ సంవత్సరంలో 17,799 మంది, ద్వితీయ సంవత్సరంలో 17,763 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం నేడు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST

News April 22, 2025

కరీంనగర్: ఓపెన్ పదో, ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

image

కరీంనగర్ జిల్లాలో సోమవారం ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావు తెలిపారు. పదో తరగితి పరీక్షకు 3 పరీక్షా కేంద్రాల్లో 410 మందికి 375 మంది, ఇంటర్ పరీక్షకు 4 పరీక్షా కేంద్రాల్లో 908 మందికి 839 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 3 టెన్త్ పరీక్ష కేంద్రాలో మొత్తం 62 మందికి 52 మంది హాజరైనట్లు పరీక్ష ఓపన్ స్కూల్ కో ఆర్డినేటర్ నాగేశ్వరరావు తెలిపారు.

error: Content is protected !!