News March 20, 2026

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘<<19423814>>ఉస్తాద్ భగత్ సింగ్<<>>’ తొలి రోజు గ్రాస్ కలెక్షన్లు ₹37.17 కోట్లుగా నమోదైనట్లు Sacnilk వెబ్‌సైట్ వెల్లడించింది. దీంట్లో ₹31.50 కోట్లు నెట్ వసూళ్లని తెలిపింది. పవన్ పవర్‌ఫుల్ డైలాగ్స్, మేనరిజమ్స్‌తో ఈ సినిమా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా మెరిశారు.

Similar News

News April 14, 2026

META సీఈవో స్థానంలో ఏఐ.. ఎందుకంటే?

image

మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ పనిభారాన్ని తగ్గించేందుకు ఆ సంస్థ ఓ AI వెర్షన్‌ను రూపొందిస్తోంది. దీనివల్ల జుకర్‌బర్గ్ భౌతికంగా అందుబాటులో లేకున్నా ఈ ఏఐ ఏజెంట్ ఆయన తరఫున నిర్ణయాలు తీసుకోవడం, సమావేశాల్లో పాల్గొనడం వంటి పనులు చేస్తుంది. సంస్థ నిర్వహణను మరింత వేగవంతం చేయడం ఈ ‘మార్క్ జుకర్‌బర్గ్ 2.0’ ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తులో ఇతర కంపెనీల్లో కూడా ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది.

News April 14, 2026

యుద్ధంతో రూ.25 లక్షల కోట్ల నష్టం: ఇరాన్

image

అమెరికా-ఇజ్రాయెల్‌తో 40 రోజులపాటు సాగిన యుద్ధం వల్ల తమకు రూ.25 లక్షల కోట్ల నష్టం జరిగినట్లు ఇరాన్ వెల్లడించింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంకా ఎక్కువే నష్టం ఉండొచ్చని తెలిపింది. దాడులకు బాధ్యులైన దేశాల నుంచి ఈ మొత్తాన్ని పరిహారం కోరతామని ప్రకటించింది.

News April 14, 2026

గాఢ సేంద్రియ ఎరువులతో ఎక్కువ లాభం

image

స్థూల సేంద్రియ ఎరువుల కంటే నత్రజని, భాస్వరం, పొటాష్‌ వంటి పోషకాలను ఎక్కువగా కలిగి ఉండి నేలకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి. ఉదాహరణ: కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండి, ఆముదపు పిండి, కానుగ పిండి, పత్తి గింజల పిండి, చేపల పొట్టు, ఎముకల పొడి, కొమ్ముల పొడి, వర్మి కంపోస్టు మొదలైనవి. వీటి కొనుగోలు కాస్త ఖర్చుతో కూడుకున్నదైనా నిపుణుల సూచనల మేరకు వీటిని వినియోగిస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది.