News April 12, 2025
ఉస్మానియా కాలేజీ, హాస్పిటల్ వరల్డ్ ఫేమస్: మంత్రి దామోదర

ఉస్మానియా కాలేజీ, హాస్పిటల్ వరల్డ్ ఫేమస్, కోట్ల మంది పేషెంట్ల ఆశాదీపమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. హైదరాబాద్‌లోని శుక్రవారం ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థుల 174వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇక్కడ చదివిన ఎంతోమంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ హాస్పిటల్స్‌ను లీడ్ చేస్తున్నారని చెప్పారు.
Similar News
News February 15, 2026
శివరాత్రికి జాగరణ ఎందుకు చేస్తారు?

శివరాత్రి రోజున గ్రహాల స్థితి వల్ల భూమిపై సహజంగానే శక్తి ఊర్థ్వ ముఖంగా ప్రవహిస్తుంది. అందుకే వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉండటం వల్ల ఆ శక్తిని మనం పూర్తిగా గ్రహించవచ్చు. నిద్రను జయించి, రాత్రంతా శివనామ స్మరణ, భజనలు చేయడం వల్ల మనసులోని అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది. సినిమాలు లేదా కబుర్లతో కాకుండా, ధ్యానంతో గడిపే జాగరణ మాత్రమే శివతత్వాన్ని మనలో జాగృతం చేసి, మోక్ష మార్గానికి దారితీస్తుంది.
News February 15, 2026
HYD: అద్దెగాడిద కష్టం.. యజమాని ఇష్టం!

అద్దెగాడిద కష్టం.. యజమాని ఇష్టం అన్న సామెత నగరంలో అద్దెకు ఉండేవారి పరిస్థితి సరిపోతుంది. ARV పేరుతో ప్రభుత్వం పన్నులు పెంచుతుంటే, ఆ భారాన్ని కిరాయిదారుల మీదకు నెడుతున్నారు. చట్టప్రకారం ‘రెంటల్ కంట్రోల్’ ఉన్నా, అది కేవలం పుస్తకాలకే పరిమితమైంది. ‘పన్ను పెరిగింది అద్దె పెంచుతున్నా’ అనే యజమానుల తీరుతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. అగ్రిమెంట్లు లేకపోవడంతో కిరాయిదారులకు కోర్టుకెళ్లే ధైర్యం లేకపోయింది.
News February 15, 2026
డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్‌లో ఇంటర్న్‌షిప్

<


