News July 7, 2024
ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో TSP జేఏసీ ఆధ్వర్యంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా TSP జేఏసీ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో TSP జేఏసీ రాష్ట్ర సెక్రటరీ ప్రవీణ్, ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ నాయకులు నవీన్, వేదంత్ మౌర్య, లవకుమార్, అభిమన్యు, రవి, ప్రవీణ్, ప్రసాద్ తో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Similar News
News February 16, 2026
NZB: BRS మద్దతుతో కాంగ్రెస్ మేయర్ ఎంపిక

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కూరగాయల ఉమారాణి BRS కార్పోరేటర్ మద్దతుతో ఎంపికయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 17 సీట్లు మాత్రమే సాధించిన కాంగ్రెస్, 14 సీట్లు గెలిచిన ఎంఐఎం, ఒకే సీటు గెలిచిన బీఆర్ఎస్ మద్దతుతో ఛైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకున్నారు. 28 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీని వెనక్కి నెట్టేశారు.
News February 16, 2026
NZB: మేయర్ ఉమారాణి నేపథ్యమిదే!

నిజామాబాద్ నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా ఎన్నికైన కూరగాయల ఉమారాణి నగరంలోని కసాబ్ గల్లికి చెందినవారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారు. గర్ల్స్ హై స్కూల్ 10వ తరగతి తరువాత ఇంటర్మీడియట్ చేసిన ఆమె ఓపెన్‌లో BA పూర్తి చేశారు. ఆమెకు నలుగురు సంతానం. ఒకరు డాక్టర్, ఇద్దరు ఇంజినీర్లు, మరొకరు MBA చేశారు. ఆమె భర్త కరాటే రమేశ్ అందరికీ సుపరిచతమే.
News February 16, 2026
NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి సోమవారం తెలిపారు. ఈనెల 12వ తేదీన గాంధీచౌక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని ఒంటిపై బ్లూ కలర్ షర్టు, గ్రే కలర్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు.


