News January 21, 2026

ఊటనేల దున్నినా, మట్టి పిసికినా, ఫలితం బురదే

image

ఊటనేల ఎప్పుడూ నీరు ఊరుతూ ఉండే, సహజంగానే చిత్తడిగా ఉండే భూమి. ఆ నేలలో ఎంత కష్టపడి నాగలితో దున్నినా లేదా చేతులతో మట్టిని పిసికి గట్టి పరచడానికి ప్రయత్నించినా దాని స్వభావం మారదు. చివరికి మిగిలేది గట్టిపడని, వ్యవసాయానికి పనికిరాని బురద మాత్రమే. కొన్నిసార్లు కొందరి మనుషుల స్వభావాన్ని ఎంత మార్చాలని ప్రయత్నించినా అవి మారవు. దాని వల్ల మన శ్రమే వృథా అవుతుందని ఈ సామెత చెబుతుంది.

Similar News

News February 12, 2026

కాంగ్రెస్ సన్నిహిత BRS MLAలు ఇప్పుడేం చేస్తారో

image

TG: మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఈనెల 16న ఛైర్మన్, మేయర్ల ఎన్నిక జరగనుంది. ఎక్స్‌అఫీషియో మెంబర్లుగా MP, MLA, MLCలు ఓటేయొచ్చు. పార్టీల విప్ వీరికీ వర్తిస్తుంది. దాన్ని ఉల్లంఘిస్తే సభ్యత్వం కోల్పోతారని SEC స్పష్టం చేసింది. ఈ తరుణంలో INC సన్నిహిత BRS MLAలు ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారుతోంది. పోటాపోటీ ఉన్న చోట్ల వీరి ఓటు కీలకం కానుంది. వీరి అనర్హతపై SC విచారణ నేపథ్యంలో విప్‌కే కట్టుబడతారంటున్నారు.

News February 12, 2026

హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో 220 పోస్టులు

image

చెన్నై ఆవడిలోని హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 220 జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతతో పాటు పనిఅనుభవం వారు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. బేసిక్ పే 21,000+IDA చెల్లిస్తారు. సైట్: avnl.co.in

News February 12, 2026

అరటిలో తొండం కుళ్లు తెగులు – నివారణ

image

సూర్యరశ్మి తాకిడికి అరటి గెల తొండంపై ఎండుమచ్చలు ఏర్పడి క్రమేపి అక్కడ కుళ్లు ఏర్పడుతుంది. గెలబరువు పెరిగినపుడు కుళ్లిన తొండం విరిగి గెలపడిపోతుంది. ఒక్కొక్కసారి గెలలో కాయలు సరిగా తయారుకావు. ఈ సమస్య నివారణకు తొండంపై అరటి ఆకులు చుట్టినట్లయితే వాటిపై ఎండు మచ్చలు ఏర్పడవు. మచ్చలు ఏర్పడిన తొండం పూర్తిగా తడిసేలా లీటరు నీటికి కార్బండిజమ్ 1గ్రా. కలిపి పిచికారీ చేయాలి.