News February 11, 2025
ఊట్కూర్: అదుపుతప్పిన స్కూటీ.. ఇద్దరికీ గాయాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739272043162_51771152-normal-WIFI.webp)
ఊట్కూరు మండల పరిధిలోని కొల్లూరు గేట్ సమీపంలో స్కూటీ అదుపుతప్పి కిందపడి ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊట్కూర్‌కు చెందిన గొల్ల కిష్టు తన స్కూటీపై మరో వ్యక్తితో కలిసి మక్తల్ వైపు వెళుతుండగా కొల్లూరు గేట్ సమీపంలో అతని స్కూటీ అదుపుతప్పి కింద పడింది. దీంతో ఇరువురికి తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు వారిని 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 11, 2025
ప్రభాస్ ముగ్గురు చెల్లెళ్లను చూశారా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739291545654_695-normal-WIFI.webp)
దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, ముగ్గురు కూతుళ్లు(ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి) బంధువుల పెళ్లిలో దిగిన ఫొటో వైరలవుతోంది. సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ వేడుకకు హాజరుకాలేదు. ఈ క్రమంలో చెల్లెళ్లంతా కలిసి డార్లింగ్‌కు త్వరగా వివాహం జరిపించాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ కొడుకే ప్రభాస్. ఇతనికి అన్న ప్రబోధ్(నిర్మాత), సోదరి ప్రగతి ఉన్నారు.
News February 11, 2025
అయిజ: గుండెపోటుతో RMP వైద్యుడు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739290717925_50929634-normal-WIFI.webp)
అయిజ మండలంలో గుండెపోటుతో RMP వైద్యుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వెంకటాపురం స్టేజీలో కొన్నేళ్లుగా వెంకట్రాముడు అనే వ్యక్తి RMP వైద్యుడిగా పని చేస్తున్నాడు. కాగా నేడు సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. వైద్యుడి మృతితో పలు గ్రామాల ప్రజలు విచారణ వ్యక్తం చేశారు.
News February 11, 2025
శివరాత్రి సందర్భంగా అధికారులతో మంత్రి సురేఖ సమీక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739261620550_18102126-normal-WIFI.webp)
మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా శివాలయాల్లో అవసరమైన ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈఓలతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, భద్రకాళి తదితర ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. గతేడాది నిర్వహణ అనుభవాల ఆధారంగా ఈసారి చర్యలు చేపట్టాలన్నారు.