News September 12, 2025
ఊట్కూర్: తల్లీకూతురు అదృశ్యం.. మిస్సింగ్ కేసు

తల్లి, కుమార్తె అదృశ్యమైన ఘటన ఊట్కూరు మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలమ్మ (24) తన కూతురు స్వాతి (4)తో కలిసి గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాలమ్మ తల్లి మణెమ్మ ఇటీవల అదృశ్యమై HYDలో దారుణ హత్యకు గురైంది. మనస్తాపంతో బాలమ్మ తన కూతురితో అదృశ్యమైనట్లు భావిస్తున్నారు.
Similar News
News September 12, 2025
HYDలో 19 యూపీఎస్సీ పరీక్ష కేంద్రాలు

HYDలో ఈనెల 14న యూపీఎస్సీ పరీక్షలు 19 కేంద్రాల్లో జరుగనున్నాయి. కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్-2, నేవల్ అకాడమి నేషనల్ డిఫెన్స్ అకాడమి-2 పరీక్షలు, నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలకు 7688 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఇదిలా ఉండగా అభ్యర్థులు 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి రావాలని హైదరాబాద్ డీఆర్ఓ వెంకటాచారి సూచించారు.
News September 12, 2025
‘మిరాయ్’ రివ్యూ&రేటింగ్

‘మిరాయ్’ అనే ఆయుధంతో హీరో దుష్టశక్తిని ఎదురించి లోకాన్ని ఎలా కాపాడారనేది స్టోరీ. మరోసారి తేజా సజ్జ నటనతో అలరించారు. చాన్నాళ్ల తర్వాత మంచు మనోజ్ మంచి క్యారెక్టర్‌తో సత్తాచాటారు. శ్రియ నటన, ఆమె పాత్ర మూవీకి ప్లస్. విజువల్స్, BGM బాగున్నాయి. క్లైమాక్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు గ్రిప్పింగ్‌గా చెప్పాల్సింది. సెకండాఫ్‌లో నెరేషన్ కాస్త స్లోగా అన్పిస్తుంది.
రేటింగ్: 3/5
News September 12, 2025
ఆ పెట్టుబడి చిట్కాలు నమ్మొద్దు: వరంగల్ సైబర్ పోలీసులు

వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే పెట్టుబడి సలహాలు నమ్మి మోసపోవద్దని వరంగల్ సైబర్ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. అవి పెట్టుబడి చిట్కాలు కావని, సైబర్ వలలని గుర్తించాలని సూచించారు. కొద్ది రోజుల్లో డబ్బులు రెట్టింపు అవుతాయన్న అత్యాశతో మోసపోవద్దని, సులభంగా డబ్బు సంపాదించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. పెట్టుబడుల విషయంలో ఆలోచించి, ఆచితూచి అడుగు వేయాలని సూచించారు.