News December 23, 2025

ఊట్కూర్: ప్రజాసేవకు తొలి అడుగు.. మాతృత్వానికి శుభారంభం

image

ఊట్కూర్ నూతన సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజే రేణుక భరత్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. సోమవారం ఉదయం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ఆమె, సాయంత్రం తల్లయ్యారు. ఒకే రోజు అటు నాయకత్వ బాధ్యత, ఇటు మాతృత్వపు ఆనందం పొందడం అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ వార్తతో గ్రామంలో ఆనందం వెల్లివిరియగా, ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి.

Similar News

News December 26, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 26, 2025

కామారెడ్డి: అటకెక్కిన ‘ఇందిరమ్మ’ మోడల్ హౌస్ నిర్మాణం!

image

సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని ప్రవేశపెట్టింది. లబ్ధిదారులు తమ ఇళ్లను ఎలా నిర్మించుకోవాలో అవగాహన కల్పించేందుకు ప్రతి మండలలో ఒక ‘ఆదర్శ ఇందిరమ్మ ఇల్లు’ నిర్మించాలని నిర్ణయించింది. అయితే, పిట్లంలో ఈ ఆదర్శ గృహ నిర్మాణం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. పనులు ప్రారంభమై తొమ్మిది నెలలు గడుస్తున్నా నేటికీ పూర్తి కాలేదు. సగంలోనే ఆగిపోయి దర్శనమిస్తోంది.

News December 26, 2025

2026: అడ్మినిస్ట్రేషన్ నామ సంవత్సరంగా..!

image

TG: CM రేవంత్ రెడ్డి 2026లో పరిపాలనపై పూర్తి ఫోకస్ ఉంటుందని సంకేతాలిచ్చారు. ప్రభుత్వ పాలసీల లీక్ ఆగడం, రెవెన్యూ పెంపు తదితరాలకు అధికారుల్లో తనకు పట్టు ముఖ్యమని గ్రహించి ఇందుకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల ఉన్నతాధికారులతో 3గం. సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పనితీరుపై ప్రతి నెలా CS రివ్యూ చేస్తారని, 3 నెలలకు ఓ సారి తానే సమీక్షిస్తానని చెప్పారు. అన్ని శాఖల్లో పేపర్లకు బదులు e ఫైల్స్ అమలు చేయాలని ఆదేశించారు.