News February 8, 2025

ఊట్కూర్: ‘మాకు అల్పాహారం అరటి పండేనా.?’

image

ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అల్పాహారం అందిస్తోంది. ఇందుకు ఒక్కో విద్యార్థికి రూ.15 ఖర్చు చేస్తోంది. కాగా ఊట్కూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు గత కొద్ది రోజులుగా ఒక అరటి పండు లేదా రూ.5 విలువ చేసే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నారని, ఇవి తమ ఆకలి తీర్చడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. మెనూ ప్రకారం అల్పాహారం ఇవ్వడం లేదంటున్నారు.

Similar News

News February 8, 2025

PHOTO: అల్లు అర్జున్ సూపర్ లుక్

image

‘పుష్ప-2’ కోసం గడ్డం పెంచిన అల్లు అర్జున్ ఈ మధ్యనే లుక్ మార్చారు. పుష్ప-2 థాంక్యూ మీట్‌లో సందడి చేసిన ఆయన గడ్డం ట్రిమ్ చేసి మరింత స్టైలిష్‌గా కనిపించారు. పుష్ప-2 రిలీజ్ తర్వాత పలు ఘటనలతో ఆయన మీడియాకు దూరమయ్యారు. ఈ క్రమంలో తాజా లుక్ అదిరిపోయిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆయన తదుపరి చిత్రంపై ప్రకటన మార్చిలో వచ్చే అవకాశముంది.

News February 8, 2025

OFFICIAL: బీజేపీకి 48, AAPకు 22 సీట్లు

image

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరింది. ఈసీ అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 70 స్థానాల్లో 48 చోట్ల బీజేపీ విజయం సాధించింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ 22 స్థానాలకే పరిమితమైంది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ వరుసగా మూడో సారి ఖాతా తెరవలేకపోయింది. ఈసీ లెక్కల ప్రకారం బీజేపీ 45.66%, ఆప్ 43.57%, కాంగ్రెస్ 6.34% ఓట్లు సాధించాయి.

News February 8, 2025

‘తండేల్’ సినిమా OTT విడుదల ఎప్పుడంటే?

image

చందూ మొండేటి తెరకెక్కించిన ‘తండేల్’ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని రూ.90 కోట్లతో రూపొందించడంతో ఓటీటీ హక్కుల కోసం భారీగానే చెల్లించినట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. థియేటర్ రెస్పాన్స్ బాగుండటంతో ఈ చిత్రం 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. ‘తండేల్’లో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య సాగే లవ్ స్టోరీ ఆకట్టుకుంటోంది.

error: Content is protected !!