News November 6, 2025
ఊట్కూర్: మారనున్న పెద్ద చెరువు రూపురేఖలు

నారాయణపేట -కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా ఊట్కూర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువును విస్తరించి రిజర్వాయర్‌గా మార్చనున్నారు. దీని నిలువ సామర్థ్యం 0.27 టీఎంసీలు. 19 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడి నుంచి ప్రెషర్ మెయిన్ పద్ధతిలో జయమ్మ చెరువు, కానుకుర్తి, దౌల్తాబాద్ ఎత్తిపోస్తారు. భూసేకరణ జరిగిన, డబ్బు రైతు ఖాతాలో జమ కాలేదు.
Similar News
News November 6, 2025
HYD: సజ్జనార్ సార్.. GUN FIRED

హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఇవాళ గన్ ఫైర్ చేశారు. నేరస్థుల గుండెల్లో కాదులెండీ తెలంగాణ పోలీస్ అకాడమీలోని బుల్స్‌ఐపై.. అకాడమీలో జరిగిన ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్‌కు సిటీ పోలీస్ బృందంతో కలిసి హాజరయ్యారు. ఫైరింగ్ రేంజ్‌లో ఉండటం ఎప్పుడూ ప్రత్యేక అనుభూతి కలిగిస్తుందని, బుల్స్‌ఐని ఎయిమ్ చేయడం ఎప్పుడూ నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని సీపీ Xలో ట్వీట్ చేశారు.
News November 6, 2025
ప్రకాశం జిల్లాలో 213 వాహనాలకు జరిమానా

ప్రకాశం వ్యాప్తంగా బుధవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 2,044 వాహనాలను తనిఖీ చేసినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 213 వాహనాలను గుర్తించి రూ.1.56లక్షల జరిమానా విధించారు. డ్రైవింగ్‌పై పూర్తి దృష్టి కేంద్రీకరించి, ప్రమాదాలు జరగకుండా చూడాలని పోలీసులు సూచించారు.
News November 6, 2025
పిరం కానున్న కొండగట్టు అంజన్న దర్శనం

జగిత్యాలలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పేరిట ఆర్జిత సేవల టికెట్ల ధరలను భారీగా పెంచారు. దీంతో భక్తులకు అంజన్న దర్శనం ‘పిరం’గా మారనుంది. కాగా, అభివృద్ధి అంటే భక్తులకు కనీస వసతులు కల్పించడమా.. లేక ఛార్జీలు పెంచడమా.. అని భక్తులు మండిపడుతున్నారు. నిత్యం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వేలాది మంది భక్తులు ఓ పక్క కనీస అవసరాలు లేక అల్లాడిపోతుంటే.. పెంచిన ఈ ఛార్జీలు మరింత భారం కానున్నాయి.


