News February 9, 2026
ఊట్కూర్: రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌లో ప్రశాంత్‌కు కాంస్య పతకం

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ రెజ్లింగ్ క్రీడా ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్-15 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఊట్కూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రశాంత్ కాంస్య పతకం సాధించాడు. ఈ విషయాన్ని పీడీ సాయినాథ్ తెలిపారు. ప్రశాంత్ సాధించిన ఈ విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు అభినందనలు తెలిపారు.
Similar News
News February 9, 2026
అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026-28 సంవత్సరానికి గాను జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. ఇందుకు సంబంధించి అర్హులైన జర్నలిస్టుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. నేటి నుంచి జర్నలిస్టులు సమాచార పౌరసంబంధాల శాఖ అధికారిక వెబ్‌సైట్ http://ipr.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News February 9, 2026
వినతులకు సత్వర పరిష్కారం చూపండి: కలెక్టర్

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. సంబంధిత శాఖ అధికారులు ప్రజల నుంచి వస్తున్న ప్రతి ఫిర్యాదును పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పీజీఆర్ఎస్‌కు వచ్చినా ఫిర్యాదు మళ్లీ రాకుండా బాధితుల పరిధిలోనే పరిష్కరించేలా చూడాలని సూచించారు.
News February 9, 2026
సదుం: ‘నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి’

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కోళ్ల ఫారం నిర్వాహకులు జీవ నియంత్రణ పద్ధతులు పాటించాలని అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ జెడి గుణశేఖర్ పిళ్ళై సూచించారు. ఫారంల వద్దకు దాణా, కోడిగుడ్లు సరఫరా చేసే వాహనాలను, ఇతర వ్యక్తులను రాకుండా చూడాలన్నారు. కోళ్ల ఉత్పత్తులు ఆహారం లో వినియోగించేవారు 100 డిగ్రీలు వేడి చేసి వాటిని తినాలని తెలిపారు.


