News January 26, 2025

ఊట్కూర్: వ్యక్తి అదృశ్యం.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు

image

ఊట్కూర్ మండల పరిధిలోని అవులోని పల్లి గ్రామానికి చెందిన వడ్ల లక్ష్మయ్య(32) అదృష్టమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వివరాలు.. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో లక్ష్మయ్య తన బట్టలను ఇస్త్రీ చేయించుకుని వస్తానని బయటికి వెళ్లి తిరిగి రాలేదు అని తెలిపారు. గ్రామంలో ఆరా తీసినా, ఇతర సమీప బంధువుల ఇళ్లలో ఎంత వెతికిన ఫలితం లేకపోయేసరికి భార్య తిమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News March 12, 2025

పెద్దపల్లి జిల్లాలో భగ్గుమంటున్న భానుడు

image

వేసవి నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. బుధవారం ముత్తారం మండలంలో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 37.6℃గా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు చలి తీవ్రత కూడా తగ్గడంతో కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 19.1℃ సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఇప్పటికే జిల్లా ప్రజలు ఉక్కుపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది.

News March 12, 2025

జగిత్యాల: తాజా మాజీ సర్పంచుల ముందస్తు అరెస్ట్

image

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సర్పంచులకు రావలసిన పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంతో అసెంబ్లీ ముట్టడిస్తారని ఉద్దేశంతో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో తాజా మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తమకు రావలసిన బకాయి బిల్లులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమకు బిల్లులు చెల్లించే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని సర్పంచులు హెచ్చరించారు.

News March 12, 2025

9వ తరగతి విద్యార్థులకు ఇస్రో పిలుపు: పార్వతీపురం డీఈవో 

image

9వ తరగతి విద్యార్థులకు ఇస్రో నుంచి పిలుపు వచ్చిందని డీఈఓ ఎన్.తిరుపతి నాయుడు తెలిపారు. యంగ్ సైంటిస్ట్ -2025 పేరిట ఉపగ్రహ ప్రయోగాలను తెలుసుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఎనిమిదో తరగతిలో 50 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. దరఖాస్తును ఈ నెల 23వ తేదీలోగా ఆన్‌లైన్లో నాలుగు దశల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటివరకు విద్యార్థుల వద్ద నుంచి 40అప్లికేషన్లు వచ్చినట్లు ఆయన తెలిపారు.

error: Content is protected !!