News August 7, 2024

ఊపందుకున్న సీతాఫలం అమ్మకాలు

image

ఏజెన్సీలోని గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న సీతాఫలాల అమ్మకాలు ప్రస్తుతం పాడేరు మండలంలో జోరందుకున్నాయి. మన్యం అమృత ఫలాలకు మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది కూడా కాపు ఆశాజనకంగా ఉండడంతో పాడేరు ఘాట్లోని వంట్లమామిడి కేంద్రంగా సీతాఫలాల అమ్మకాలు సాగుతున్నాయి. రెండు బుట్టలను కావిడ రూ. 1000 నుంచి రూ.1500 వరకు రేటు పలుకుతోంది.

Similar News

News July 8, 2025

ప్రత్యేక ఆకర్షణగా అప్పన్న ఆలయం నమూనా సెట్టు

image

ఎంవీపీ కాలనీ ఒకటో సెక్టార్‌లో ప్రత్యేక ఆకర్షణగా అప్పన్న ఆలయం నమూనా సెట్టు ఏర్పాటు చేశారు. స్థానికంగా కొందరు మిత్రులు కలసి గిరిప్రదక్షిణ భక్తుల కోసం దీనిని నిర్మించారు. ఇందులో వేంకటేశ్వర స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం ఇక్కడ ప్రసాద వితరణతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

News July 8, 2025

గిరి ప్రదక్షిణకు మహా ‘గట్టి’ ఏర్పాట్లు సుమా..!

image

గిరి ప్రదక్షిణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే హనుమంతువాక నుంచి వెంకోజీపాలెం వరకూ జాతీయ రహదారిపై పాదచారుల కోసం చేసిన ఏర్పాటు చూస్తే.. చిన్న పాటి కర్ర పాతి, దానికి సన్నని రిబ్బన్ కట్టి, వాహనాలు ఇటు రాకుండా, పాదచారులు అటు వెళ్లకుండా విభజన చేశారు. లక్షల్లో నడిచే ఈ దారిలో ట్రాఫిక్ కూడా ఎక్కువే. ఇంత ‘గట్టి’ ఏర్పాట్లు చేసిన అధికారులను ఎలా అభినందించాలో తెలియడం లేదంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు.

News July 8, 2025

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ

image

విశాఖ జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ మెమో ఉత్తరులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం మెమో పత్రాలను లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్, ఏపీయూడబ్ల్యూజే, జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీ సంఘాల నాయకులకు డీఈవో ప్రేమ్ కుమార్ అందజేశారు. దీనిపై పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.