News January 25, 2025
ఊరించడమే కాంగ్రెసోళ్ల పని: కుత్బుల్లాపూర్ MLA

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలుపై BRS కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శలు గుప్పించారు. నేడు, రేపు, మాపు అంటూ ఊరించడమే కాంగ్రెసోళ్ల పని అని, రేషన్ కార్డులు ఇదిగో ఇస్తాం..! అదిగో ఇస్తాం..! అంటూ ఊరిస్తున్నారే తప్ప, అర్హులకు అందించడం లేదన్నారు. పేదలకు పథకాలు అందకపోతే, కుత్బుల్లాపూర్ నుంచి ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఎన్ని సార్లు దరఖాస్తులు తీసుకుంటారని ప్రశ్నించారు.
Similar News
News November 9, 2025
వరంగల్: పొన్నం జీ.. జర దేఖో జీ..!

రవాణా శాఖలో ప్రతి పనికో రేటు ఉంటుంది. అది చెల్లిస్తేనే మన పని అవుతుందన్న నిజం ప్రతి వాహనదారుడికి, లైసెన్సుదారుడికి తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల లంచం రేట్లు పెరిగాయి. ఎన్ని ఆన్‌లైన్లో నమోదు చేసినా చివరికి పెన్సిల్ టిక్ పడితేనే RTAలో మనపని జరుగుతుందని అందరికీ తెలిసినా, ACBకి ఎందుకు తెలియట్లేదో అర్థం కావట్లేదు. నిత్యం ఏజెంట్లు, అధికారులకు బహిరంగంగా ముడుపులు ఇస్తున్నా వాళ్లు దొరకట్లేదు.
News November 9, 2025
కడప: వివాదంగా మారిన టీచర్లు టూర్

మైదుకూరు మండలం నంద్యాలం పేట కాంప్లెక్స్ పరిధిలోని 20మంది టీచర్లు ఒకేసారి సెలవు పెట్టి టూర్‌కు వెళ్లారు. ఒకే టీచర్ ఉన్న స్కూళ్ల నుంచి సైతం సెలవు పెట్టడం వివాదాస్పదమైంది. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రెండో శనివారం లీవ్ ఉంటుందని టీచర్లు ముందుగానే టూర్ ప్లాన్ చేసుకున్నారు. చివరి నిమిషంలో ఆ లీవ్ రద్దు చేశారు. టూర్ క్యాన్సిల్ చేసుకోలేక అందరూ వెళ్లారు.
News November 9, 2025
సీఎం చేతికి తిరువూరు నివేదిక.. చంద్రబాబు ఏమన్నారంటే..!

విజయవాడ ఎంపీ చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ల వివాదంపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు సీఎం చంద్రబాబుకు నివేదిక, పెన్ డ్రైవ్‌ను అందించారు. నేతలు బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడాన్ని సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. ఈ పంచాయితీపై తన వద్ద కూడా సమగ్ర నివేదిక ఉందని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. త్వరలో ఇద్దరు నేతలను పిలిపించి మాట్లాడతానని ఆయన వెల్లడించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.


