News February 25, 2026

ఊరిలో సగం మంది కవలలే..!

image

కేరళలోని కొడిన్హి గ్రామం ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా వెయ్యి జననాల్లో కేవలం నలుగురు కవలలు పుడితే ఇక్కడ ఆ సంఖ్య ఏకంగా 45కి పైగా ఉంది. సుమారు 2,000 కుటుంబాలున్న ఆ ఊరిలో 400కు పైగా కవల జంటలు నివసిస్తున్నాయి. దీనికి గల కారణాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు, డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు. ఇలాంటి వింతైన విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’ ఎపిసోడ్‌లో..

Similar News

News February 25, 2026

చెప్పుల స్టాండ్ ఎక్కడ ఉండాలంటే?

image

ఇంటి ప్రధాన ద్వారం మహాలక్ష్మి ప్రవేశించే ప్రదేశమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘అందుకే చెప్పులను గుమ్మానికి అడ్డంగా ఉంచకూడదు. అలా విడిస్తే సానుకూల శక్తి ఆగిపోతుంది. ఇంటి యజమాని గౌరవం తగ్గుతుంది. చెప్పుల స్టాండ్ ఇంటికి పశ్చిమ/వాయువ్య దిశలో ఉంచటం శ్రేయస్కరం. షూ రాక్‌ను ఎప్పుడూ మూసి ఉంచాలి. క్రమ పద్ధతిలో అమర్చాలి. ఉత్తర/తూర్పు దిశల్లో ఉంచితే ఇబ్బందులు కలుగుతాయి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 25, 2026

2018 గ్రూప్-1 అధికారుల మూకుమ్మడి బదిలీ

image

AP: 2018 బ్యాచ్ గ్రూప్-1 నుంచి ఎంపికైన అధికారులందరినీ రిలీవ్ చేస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రిక్రూట్‌మెంట్ లోపాలపై విచారణ పూర్తయ్యేవరకు అప్రాధాన్య పోస్టుల్లో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. కాగా 2018 నోటిఫికేషన్ ద్వారా 167 మంది గ్రూప్-1 అధికారులుగా ఎంపికయ్యారు. వీరు గత రెండేళ్లుగా రాష్ట్రంలోని వివిధ కీలక శాఖల్లో విధుల్లో ఉన్నారు.

News February 25, 2026

ప్రియురాలితో బిగ్‌బాస్ నటుడి ఎంగేజ్‌మెంట్

image

యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రేయసి వైష్ణవిని పరిచయం చేసిన అతడు ఇవాళ ఆమెకు రింగ్ తొడిగారు. ఈ ఫొటోలను SMలో షేర్ చేశారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఈ జంటకు విషెస్ చెబుతున్నారు. కాగా బిగ్‌బాస్-5లో షణ్ముఖ్ రన్నరప్‌గా నిలిచారు.