News October 10, 2025

ఊర్కోండలో అత్యధిక వర్షపాతం నమోదు

image

జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలో వర్షం కురిసింది. అత్యధికంగా ఊర్కొండలో 47.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెల్టుర్ 29.8, బొల్లంపల్లి 28.8, ఎల్లికల్ 25.3, తోటపల్లి 13.0, ఎంగంపల్లి 11.5, సిర్సనగండ్ల 7.5, కొల్లాపూర్ 1.8, తెలకపల్లి, జటప్రోలు 1.0, అత్యల్పంగా కల్వకుర్తి, కోడేర్‌లో 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

Similar News

News October 10, 2025

విశాఖ: హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టిక్కెట్లు

image

విశాఖ వేదికగా VCA – ADCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈనెల 12న (ఆదివారం) ఇండియా V/S ఆస్ట్రేలియా ఉమెన్స్ తలపడనున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇప్పటికే అక్కడ జరిగిన మ్యాచులో సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ చేతిలో ఇండియా ఉమెన్స్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆదివారం సెలవు రోజు కావటంతో అధిక సంఖ్యలో క్రికెట్ అభిమానులు మ్యాచ్ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

News October 10, 2025

తిరుపతి గరుడ వారధిపై ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

image

తిరుపతి లక్ష్మీపురం కూడలి వద్ద గరుడ వారధిపై శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు బైకుపై వెళ్తూ సేఫ్టీ వాల్‌ను బలంగా ఢీకొట్టి కింద పడిపోయారు. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 10, 2025

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు

image

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో విభిన్న ప్రతిభావంతులకు ఏర్పాటు చేసిన సదరం క్యాంపును శుక్రవారం కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దివ్యాంగుల పెన్షన్ కోసం రీ అసెస్మెంట్‌లో భాగంగా విభిన్న ప్రతిభావంతులకు సదరం క్యాంప్ పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. రోగులతో ఆప్యాయంగా మాట్లాడి సేవలందించాలని కలెక్టర్ తెలిపారు. ఇక్కడికి వచ్చిన వారికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.