News February 13, 2025
ఎంఎల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

ఎంఎల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల పరిశీలకులు కే.సునీత ఆదేశించారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల పీఓలను, ఏపీఓలను నియమించారా? అని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మాట్లాడతూ.. పీఓలకు, ఏపిఓలకు, ఇతర పోలింగ్ సిబ్బంది ఈనెల 18,24 తేదీల్లో రెండు విడతల్లో శిక్షణ అందించడానికి ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News November 12, 2025
అల్లూరి జిల్లాలో 11,598 గృహాలు ప్రారంభం

అల్లూరి జిల్లాలో నేడు 11,598 గృహాల ప్రారంభోత్సవాలు జరగనున్నాయని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. పాడేరు నియోజకవర్గంలో సప్పిపుట్టు, అరకు నియోజకవర్గంలో సిమిలిగూడ, రంపచోడవరం నియోజకవర్గంలో అడ్డతీగలలో నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరుగుతాయని, తగిన ఏర్పాట్లు చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News November 12, 2025
సిద్దిపేట జిల్లాలో ఏసీబీ రైడ్స్!

సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం ఏసీబీ రైడ్స్ జరిగాయి. రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ విజయ్ కుమార్, కానిస్టేబుల్ రాజు ఏసీబీకి చిక్కారు. ఎస్ఐ, కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ పోలీస్ స్టేషన్‌లో విచారణ జరిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 12, 2025
నేడు మేడారానికి నలుగురు మంత్రులు

ములుగు జిల్లా మేడారంలో బుధవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించనున్నారు. రానున్న మహా జాతర నేపథ్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వారు పరిశీలిస్తారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా చేరుకుని, 12 గంటలకు అధికారులతో సమావేశమై పనుల పురోగతిపై సమీక్షించనున్నారు.


