News January 14, 2026

ఎంఎస్‌ఎంఈ పార్కుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి

image

దెందులూరు నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు తక్షణమే ప్రతిపాదనలు రూపొందించాలని పరిశ్రమల శాఖ రాష్ట్ర కార్యదర్శి యువరాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సోమవరప్పాడులో పార్కు కోసం ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించి, సమగ్ర నివేదిక పంపాలని ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు.

Similar News

News February 16, 2026

మంత్రి లోకేశ్‌తో కలసి క్రికెట్ చూసిన ఎంపీ సానా

image

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరుకు శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియం వేదికైంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, రాజ్యసభ సభ్యుడు, ACA కార్యదర్శి సానా సతీశ్ బాబు ప్రత్యక్షంగా వీక్షించారు. గ్యాలరీలో భారత జెండా ఊపుతూ జట్టు విజయాన్ని వీరు మనస్ఫూరంగా ఆస్వాదించారు.

News February 16, 2026

సర్వైకల్ క్యాన్సర్‌ ఎలా వస్తుంది?

image

గర్భాశయ ముఖద్వారం(Cervical Cervix)లోని కణాలకు సోకే హ్యూమన్ పాపిలోమా వైరస్(HPV) ఇది. చిన్నవయసులోనే పెళ్లిళ్లు-లైంగిక చర్య, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, ఎక్కువసార్లు ప్రసవాలు కావడం ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు. లైంగిక సంబంధాలతోనూ వ్యాపిస్తుంది. వంశపారపర్యం వల్ల రాదు. వైరస్ సోకిన 10-15 ఏళ్ల తర్వాత క్యాన్సర్ బయటపడుతుంది. అందుకే TG ప్రభుత్వం అమ్మాయిలకు ముందస్తుగా <<19154216>>వ్యాక్సిన్<<>> ఇవ్వనుంది.

News February 16, 2026

చెర్వుగట్టుకు పోటెత్తారు

image

మహాశివరాత్రి కావడంతో చెర్వుగట్టుకు భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరగగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, తోపులాటలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. క్యూ లైన్ల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.