News February 26, 2025

ఎంఎస్ఎంఈ సర్వే వేగవంతం చేయండి: కలెక్టర్

image

అల్లూరి జిల్లాలో ఉన్న సూక్ష్మ, చిన్న తరహా సంస్థల సర్వే వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను మంగళవారం ఆదేశించారు. జిల్లాలో 11,279 సూక్ష్మ చిన్న తరహా సంస్థలలో 4,608 సంస్థలను సర్వే చేసారని, మిగిలిన 6,671 సంస్థల సర్వే పూర్తిచేయాలన్నారు. MSME సర్వే సక్రమంగా చేయని MPDOలకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ CEOను ఆదేశించారు. మార్చి 8నుండి 18వరకు సర్వే జరుగుతుందన్నారు

Similar News

News December 15, 2025

క్యాబేజీలో రెక్కల పురుగు నివారణకు సూచనలు

image

క్యాబేజీలో రెక్కల పురుగు లార్వాలు ఆకుల అడుగు భాగాన చేరి తినడం వల్ల ఆకులు వాడి ఎండిపోతాయి. వీటి ఉద్ధృతి ఎక్కువైతే ఆకులకు రంధ్రాలు పడి క్యాబేజీ పరిమాణం తగ్గుతుంది. దీని నివారణకు ప్రతి 25 క్యాబేజీ వరుసలకు 2 వరుసల ఆవ మొక్కలను ఎర పంటగా నాటాలి. రెక్కల పురుగు గుడ్లను నాశనం చేసేందుకు 5% వేపగింజల ద్రావణాన్ని, ఉద్ధృతి మరీ ఎక్కువైతే లీటరు నీటికి నోవాల్యురాన్1ml కలిపి కోతకు 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

News December 15, 2025

లిక్కర్ స్కామ్ కేసు: SC విచారణ జనవరి 21కి వాయిదా

image

ఏపీ అక్రమ మద్యం కేసులో గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను SC విచారించింది. వారికి సరెండర్ నుంచి ఇచ్చిన మినహాయింపును జనవరి 21 వరకు పొడిగించి తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేసింది. ఈమేరకు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ట్రయల్ కోర్టు ఛార్జిషీట్‌ను కాగ్నిజెన్స్‌లోకి తీసుకునేందుకు తమ ఉత్తర్వులు అడ్డంకి కాబోవని స్పష్టం చేసింది.

News December 15, 2025

ములుగు: భార్య సర్పంచ్.. భర్త వార్డు మెంబర్..!

image

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ములుగు మండలం ఖాసీందేవిపేట సర్పంచ్‌గా వాంకుడోతు నిరోషా గెలిచారు. ఆమె భర్త అమర్ సింగ్ 6వ వార్డు నుంచి వార్డు సభ్యుడిగా విజయం సాధించారు. ఒకే పంచాయతీ కార్యవర్గంలో భార్య సర్పంచ్‌గా, భర్త వార్డు సభ్యుడిగా ఉండటంతో సర్వత్రా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అమర్ సింగ్ కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందారు.