News December 13, 2025
ఎంజీఎంలో కానరాని పెస్ట్ కంట్రోల్!

వరంగల్ MGM ఆసుపత్రిలో శానిటేషన్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయని రోగులు గగ్గోలు పెడుతున్నారు. వార్డుల్లో అపరిశుభ్రత కారణంగా చెత్తా చెదారంతో ఎలుకలకు నివాస కేంద్రంగా మారిందంటున్నారు. రోగుల బెడ్లపైకి చేరి చేతులను కొరికే వరకు చేరిందంటే MGMలో శానిటేషన్ ఏ మేర ఉందో తెలుస్తోంది. నల్లబెల్లి(M) నందిగామకు చెందిన <<18554300>>భరత్ అనే రోగి ఉంగరం వేలును<<>> ఎలుక కొరికిన విషయం తెలిసిందే.
Similar News
News December 16, 2025
బొబ్బిలి: మార్మాంగం కోసుకున్న మతిస్థిమితం లేని యువకుడు

బొబ్బిలి పట్టణంలోని మతిస్థిమితం లేని యువకుడు మార్మాంగం కోసేసుకున్నాడు. విశాఖపట్నం రెల్లి వీధి ప్రాంతానికి చెందిన మతిస్థిమితం లేని యువకుడు సోమవారం బొబ్బిలిలో రక్తంతో రోడ్లుపై తిరుగుతుండగా స్థానికులు గమనించారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రథమ చికిత్సకు యువకుడు సహకరించకపోవడంతో వైద్యులు బలవంతంగా వైద్యం చేసి విజయనగరం రిఫర్ చేయగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం KGHకి తరలించారు.
News December 16, 2025
మోదీ గొప్ప స్నేహితుడు: ట్రంప్

భారత్‌తో పాటు ప్రధాని మోదీపై US అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ‘ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఇండియా ఒకటి. ఇది అద్భుత దేశం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి. మనకు PM మోదీ అనే గొప్ప స్నేహితుడు ఉన్నారు’ అని చెప్పారు. ఈ విషయాన్ని ఇండియాలోని US ఎంబసీ ట్వీట్ చేసింది. ద్వైపాక్షిక ట్రేడ్ డీల్ కోసం అమెరికా బృందం ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
News December 16, 2025
WGL: స్వస్తిక్ ముద్ర బాక్స్ దాటితే చెల్లదంతే..!

జిల్లాలో మూడో విడత ఎన్నికలు బుధవారం జరగనుంది. స్థానిక సంస్థల ప్రతినిధుల ఎన్నికల కోసం బ్యాలెట్ పేపర్‌ను వినియోగిస్తున్నారు. గులాబీ రంగు, తెలుపు రంగులో బ్యాలెట్ పేపర్‌లో పేర్లు లేకుండా గుర్తులు మాత్రమే ఉంటాయి. గుర్తుల పక్కన ఉన్న బాక్స్‌లో ఓటరు స్వస్తిక్ ముద్రను వేయాలి. ఓటర్లు ఓటు అలా వేయకుండా గడి దాటి ముద్రవేస్తే గడి సరిహద్దులపై పడితే చెల్లదు. ఎమరుపాటు ఉండొద్దని అధికారులు సూచిస్తున్నారు.


