News January 7, 2026
ఎంజీఎంలో పని చేయని ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్!

వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎంకేర్ పథకం కింద ఏర్పాటు చేసిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు పని చేయడం లేదు. గంటకు 1000 కిలోల ఆక్సిజన్ ఉత్పత్తి చేయగల ఈ ప్లాంట్ల ఆక్సిజన్ రోగులకు ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రి, సీకేఎం, జీఎంహెచ్, కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోని ప్లాంట్లు పని చేయక ప్రైవేట్‌గా ఆక్సిజన్ కొనుగోలుకు నెలకు రూ.లక్షల భారం పడుతోంది.
Similar News
News February 14, 2026
కిరండూల్ ప్యాసింజర్ రైళ్ల దారి మళ్లింపు

వాల్తేరు డివిజన్ కేకే లైన్లో ఆధునీకీకరణ పనుల కారణంగా విశాఖపట్నం-కిరండూల్ (58501) ప్యాసింజర్ ఈ నెల 16 నుంచి 27 వరకు దంతేవాడ వరకే నడువనుంది. తిరుగు ప్రయాణంలో కిరండూల్-విశాఖపట్నం (58502) రైలు 17 నుంచి 28 వరకు కిరండూల్‌కు బదులుగా దంతేవాడ నుంచే ప్రారంభమవుతుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని రైల్వే శాఖ కోరింది.
News February 14, 2026
NZB: ఓడిన మాజీ మేయర్ కుటుంబీకులు

మొన్నటి వరకు నిజామాబాద్ మేయర్‌గా ఉన్న దండు నీతూ కిరణ్(BRS) కుటుంబీకులు ఇద్దరూ ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోయారు. దండు నీతూ కిరణ్ భర్త దండు చంద్రశేఖర్ ఈ ఎన్నికల్లో BRS తరఫున 8వ డివిజన్ నుంచి, 21వ డివిజన్ నుంచి ఆయన కూతురు దండు రుషిత పోటీలో నిలబడ్డారు. అయితే ప్రజా తీర్పులో తండ్రీ కూతుర్లు ఇద్దరూ ఓటమి చెందారు.
News February 14, 2026
కరివేపాకుతో మెరిసే చర్మం

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీమైక్రోబయల్ వంటి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు, చర్మాన్ని మెరిసేలా చేస్తాయని నిపుణులంటున్నారు. * కరివేపాకు, పాలతో చేసిన పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల మచ్చలు, ముడతలు తగ్గుతాయి. * కరివేపాకు మరిగించిన నీళ్లలో కొద్దిగా శనగపిండి, నిమ్మరసం కలిపి కూడా ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరుస్తుంది.


