News February 10, 2026
ఎంజీఎం ల్యాబ్‌లో నిలిచిన సీరం ఎలక్ట్రోలైట్స్ పరీక్షలు

ఎంజీఎం ఆస్పత్రిలోని సెంట్రల్ ల్యాబ్‌లో సీరం ఎలక్ట్రోలైట్స్ పరీక్షలు జరగడం లేదు. కెమికల్ కొరత కారణంగా పరీక్షలు జరగడం లేదని సిబ్బంది తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రికి వచ్చే వారిలో ఎక్కువగా అత్యవసర రోగులే ఉంటారు. చికిత్సకు ముందు సీరం ఎలక్ట్రోలైట్స్ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తారు. ఈ పరీక్ష ఆస్పత్రిలో లేక ప్రైవేటుకు వెళ్లాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. పరీక్షలు ఇక్కడే జరిగేలా చూడాలన్నారు.
Similar News
News February 11, 2026
కమలాపురం: ‘హత్య కేసులో ముగ్గురికి జీవితఖైదు’

కమలాపురం పరిధిలో 2017లో జరిగిన సుధీకర్ హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ కడప IV అదనపు జిల్లా సెషన్స్ జడ్జి జి. దీనబాబు తీర్పు వెల్లడించారు. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలో A1 గౌరీగల్లే ఈశ్వరమ్మ, A2 షిండే చంద్ర, A3 సయ్యద్ ముబారక్ కలిసి కత్తితో పొడిచి, కర్రలతో దాడి చేసి హత్య చేసినట్లు కోర్టు నిర్ధారించింది. ముగ్గురికి జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధించారు.
News February 11, 2026
EXIT POLLS.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇలా..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 2 నుంచి 4 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 7 నుంచి 9 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP ఒక్క మున్సిపాలిటీ కూడా గెలిచే అవకాశం లేదని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.
News February 11, 2026
కాంగ్రెస్ కుట్రలు ప్రజల తీర్పును ప్రభావితం చేయలేవు: హరీశ్ రావు

కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలు, డబ్బు సంచులు ప్రజల తీర్పును ఏమాత్రం ప్రభావితం చేయలేవని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు అడుగడుగుల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులకు కొందరు పోలీసులు సహకరించడం పై మండిపడ్డారు. బీఆర్ఎస్‌పై విశ్వాసంతో ఓటు వేసిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.


