News October 26, 2025
ఎంజీఎం సూపరింటెండెంట్‌పై వేటు

ఎంజీఎం ఆసుపత్రిలో వరుస ఘటనలు,<<18099653>> ‘ఔరా ఇదేం వైద్యం.. ఎంజీఎంలో ఇద్దరికీ ఒకే సిలిండర్!’ <<>>అని Way2Newsలో శనివారం మధ్యాహ్నం ప్రచురితమైన కథనంపై మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్‌పై వేటు వేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, ప్రతి వారం ఆసుపత్రిపై సమీక్షించి నివేదిక ఇవ్వాలని డీఎంఈ నరేంద్ర కుమార్‌కు సూచించారు.
Similar News
News October 28, 2025
నిర్మల్: రేపటి నుంచి సోయా కొనుగోలు ప్రారంభం

నిర్మల్ మార్కెట్ యార్డ్‌లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో బుధవారం (రేపటి) నుంచి సోయా కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ సోమ భీమ్ రెడ్డి తెలిపారు. రైతుల పంటను త్వరగా కొనుగోలు చేయాలని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల, ఇన్ ఛార్జ్ మంత్రి జూపల్లి దృష్టికి తీసుకువెళ్లారని ఆయన పేర్కొన్నారు. కొనుగోళ్లకు రైతులు సహకరించాలని కోరారు.
News October 28, 2025
‘మొంథా’ తుఫాను సమాచారం.. ఎప్పటికప్పుడు!

మొంథా తుఫాను ప్రభావంతో బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. తాజా వాతావరణ సమాచారం, అధికారుల సూచనలు, సహాయక చర్యల వివరాలు తెలుసుకోవడానికి ‘Way2News’ను ఫాలో అవ్వండి. కచ్చితమైన, తాజా అప్‌డేట్‌లను అందిస్తూ మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో వే2న్యూస్ తోడుగా ఉంటుంది.
News October 28, 2025
ఫేక్ ప్రచారాలు చేసే వారిపై చర్యలు: సీపీ

విజయవాడలోని బుడమేరు పొంగుతుందని ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడానికి కొంతమంది ఫేక్ సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నారని సీపీ రాజశేఖర్ బాబు అన్నారు. ప్రజలు ఎవరూ కూడా అపోహలను నమ్మొద్దని చెప్పారు. తుపానుపై ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం పనిచేస్తుందని, ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఫేక్ ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


