News March 1, 2026

ఎంజీయూ ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ పరీక్షల షెడ్యూల్

image

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ పరీక్షల సమయ పట్టికను వర్సిటీ అధికారులు విడుదల చేశారు. 8వ సెమిస్టర్ (రెగ్యులర్ & బ్యాక్‌లాగ్) పరీక్షలు మార్చి 11 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. అలాగే 3, 5, 7, 9 సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షల వివరాలను ఎంజీయూ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు.

Similar News

News March 2, 2026

VZM: రబీ సీజన్‌కు యూరియా కొరత లేదు

image

రబీ సీజన్ 2025-26కు జిల్లాలో యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి వీటి రామారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు అవసరమైన యూరియాలో ఎక్కువ భాగం సరఫరా కాగా, 5,398 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. రబీ సీజన్‌లో ఎటువంటి కొరత ఉండదని స్పష్టం చేశారు. రైతులు మట్టి పరీక్ష ఆధారంగా సమతుల ఎరువులు వినియోగించాలని సూచించారు.

News March 2, 2026

సంగారెడ్డి: ప్రజావాణికి 56 ఫిర్యాదులు

image

సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ప్రావీణ్య జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద వినతి పత్రాలను స్వీకరించారు. మొత్తం 56 మంది తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

News March 2, 2026

మేం యుద్ధాన్ని స్టార్ట్ చేయలేదు కానీ ముగిస్తాం: US

image

ఇరాన్‌తో యుద్ధాన్ని తాము మొదలు పెట్టలేదని, కానీ ముగించేది మాత్రం తామేనని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సేత్ అన్నారు. ఇరాన్‌పై జరిగిన ఏరియల్ ఆపరేషన్ చరిత్రలో అత్యంత సంక్లిష్టమైన, కచ్చితమైనదని పేర్కొన్నారు. ‘ఇరాన్ వంటి ప్రభుత్వాలు అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు. అమెరికన్లను చంపే/బెదిరించే ఎవరినైనా వేటాడుతాం. ఇది అంతులేని యుద్ధంగా మారదు. కానీ ఇరాన్‌లో ప్రభుత్వం మారుతుంది’ అని వ్యాఖ్యానించారు.