News November 30, 2024
ఎంజీయూ నుంచి మొట్టమొదటి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్

MGU కామర్స్ విభాగం అధ్యాపకుడు డా కొసనోజు రవిచంద్ర తెలంగాణలోని నూతనంగా ఏర్పాటైన నాలుగు యూనివర్సిటీల్లో మొట్టమొదటి పోస్ట్ డాక్టోరల్ రీసర్చ్ స్కాలర్ గా చేరడంతో పాటు ఐసీఎస్ఎస్ఆర్ 2024-25 ఫెలోషిప్ కు ఎంపికయ్యారు. రవిచంద్ర తన పీజీ ఎంజీయూలోనే అభ్యసించి, తన గురువు కామర్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. కౌత శ్రీదేవి పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ డిగ్రీ అందుకున్నారు.
Similar News
News February 21, 2026
NLG: మరో వారం రోజులే గడువు

ఫార్మర్ రిజిస్ట్రీకి మరోవారం రోజులే గడువు మిగిలి ఉంది. ప్రతి రైతుకు గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డులను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 5,54,347 మంది పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులు ఉన్నారు. కానీ ఇప్పటివరకు 2,41,039 మంది రైతులు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
News February 21, 2026
నల్గొండ: ఆందోళన కలిగిస్తున్న మరణాలు

నల్గొండ జిల్లాలో శుక్రవారం విషాదం నిండిన రోజుగా మిగిలింది. వేర్వేరు ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఆందోళన కలిగిస్తున్నాయి. మామిడాలలో అప్పుల బాధతో సంతోశ్ ఉరివేసుకోగా, తెట్టకుంటలో మానసికస్థితి సరిగా లేక నర్సమ్మ నిప్పంటించుకుని మృతి చెందింది. నకిరేకల్‌లో గీత కార్మికుడు వెంకటేశం చెట్టుపై నుంచి పడి, మండలాపురంలో తల్లిదండ్రులు మందలించారని మహేశ్ గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.
News February 21, 2026
సాగర తీరానికి జలకళ.. పర్యాటకులకు ప్రకృతి విందు!

ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ జలాశయం క్రమంగా జలకళను సంతరించుకుంటోంది. ఎగువన ఉన్న శ్రీశైలం నుండి విద్యుదుత్పత్తి ద్వారా వస్తున్న వరదతో వారం రోజులుగా సాగర్ నీటిమట్టం పెరుగుతూ పర్యాటకులకు కనువిందు చేస్తోంది. గడిచిన వారం రోజుల్లోనే ప్రాజెక్టు నీటిమట్టం 5 అడుగులు పెరిగి ప్రస్తుతం 541 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి ప్రస్తుతం 56,315 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.


