News October 18, 2024

ఎంజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా ఖాజా అల్తాఫ్ హుస్సేన్

image

నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఖాజా అల్తాఫ్ హుస్సేన్ నియమితులయ్యారు. గతంలో కూడా ఆయన ఇక్కడ  వైస్ ఛాన్సలర్‌గా పని చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంజీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, సిబ్బంది అభినందనలు తెలిపారు.  

Similar News

News December 23, 2025

రేపు నల్గొండలో ట్రై సైకిళ్ల పంపిణీ

image

జిల్లాలోని దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా యంత్రాంగం మరో ముందడుగు వేసింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక చొరవతో ఈసీఐఎల్ సీఎస్‌ఆర్ నిధుల కింద సుమారు రూ.70 లక్షల వ్యయంతో 105 మంది బాధితులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. రేపు(బుధవారం) ఉదయం 10 గంటలకు స్థానిక మహిళా ప్రాంగణంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు ఈసీఐఎల్ ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపారు.

News December 23, 2025

దరఖాస్తుల పెండింగ్‌పై నల్గొండ కలెక్టర్ సీరియస్

image

విద్యార్థుల ఉపకార వేతనాలకు ఆటంకం కలగకుండా కుల, ఆదాయ ధ్రువపత్రాలను తక్షణమే జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం కనగల్ మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆమె ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్థితిగతులను సమీక్షించారు. సర్టిఫికేట్ల జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తూ, అవసరమైతే ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

News December 23, 2025

NLG: అమ్మో ర్యాగింగ్ భూతం..!

image

కోటి ఆశలతో ఉన్నత విద్యను అభ్యసించడానికి కళాశాలల్లో అడుగుపెట్టే విద్యార్థులను ర్యాగింగ్ భూతం భయపెడుతుంది. జిల్లాలో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. స్థానిక మెడికల్ కళాశాలలో ప్రారంభమైన ఈ విష సంస్కృతి క్రమంగా డిగ్రీ కళాశాలల్లోకి ప్రవేశించింది. తాజాగా స్థానిక గురుకుల కళాశాలలో తోటి విద్యార్థుల వేధింపుల కారణంగా ఓ విద్యార్థిని 4 రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.