News March 14, 2025
ఎంటెక్ ఫలితాల విడుదల

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఎంటెక్ 1వ, 2వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R21) పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ పీ.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కే.మాధవి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.
Similar News
News April 1, 2026
Pharm.D పరీక్ష ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలో ఫిబ్రవరి నెలలో జరిగిన Pharm.D 1, 2, 3, 4, 5 సంవత్సరాల సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ శివకుమార్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. విద్యార్థులు తమ మార్కుల వివరాలను తెలుసుకోవడానికి https://jntuaresults.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
News April 1, 2026
26 రకాల లబ్ధిదారులకు పెన్షన్ అందించాం: కలెక్టర్

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 26 రకాల పెన్షన్స్ పంపిణీ చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. వృద్ధులు, వితంతువులు, డిజేబుల్ పెన్షన్స్, క్రోనిక్ డిజేబుల్, తదితర పెన్షన్ లబ్ధిదారులు 2,78,931 ఉన్నట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ అందజేశారన్నారు.
News April 1, 2026
అనంతపురం జిల్లాలో 102.4 మి.మీ వర్షపాతం నమోదు

అనంతపురం జిల్లాలో 102.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మండలాల వారీగా గుత్తిలో 31.2 మి.మీ, కంబదూరులో 34.6 మి.మీ, ఉరవకొండలో 28.2 మి.మీ వర్షం కురిసింది. అలాగే సెట్టూరు 14.6 మి.మీ, వజ్రకరూరు 5.8 మి.మీ, బ్రహ్మసముద్రంలో 5.0 మి.మీ వర్షపాతం నమోదైంది.


