News February 22, 2025

ఎండతో భగ్గుమంటున్న జనగామ!

image

జనగామ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. పలు చోట్ల ఉదయం మంచు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల ఎండ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతేకాదు, చెరువులు, వాగులు, కుంటల్లో సైతం నీరు ఖాళీ అవుతోంది. దీంతో ప్రయాణం సాగించాలంటేనే వృద్ధులు, పిల్లలు జంకుతున్నారు. మరి మీ ప్రాంతంలో ఎండ ప్రభావం ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News December 17, 2025

22న మామిడి రైతుల చలో కలెక్టరేట్

image

చిత్తూరు: మామిడి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 22న చలో కలెక్టరేట్ నిర్వహించనున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మామిడి రైతు సంఘ విస్త్రృతస్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు మునీశ్వర్ రెడ్డి, మురళి ప్రసంగించారు. జిల్లాలోని 40వేల మంది రైతులకు రూ.360 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. రైతుల అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.

News December 17, 2025

నరసరావుపేట TDP పార్లమెంటరీ అధ్యక్షుడిగా కోమ్మాలపాటి.!

image

నరసరావుపేట పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కోమ్మాలపాటి శ్రీధర్ నియామకం దాదాపు పూర్తి అయింది. శ్రీధర్ 2024 నుంచి ఇప్పటి వరకు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఆయన పని చేస్తున్నారు. టీడీపీ అధిష్ఠానం మల్లీ ఆయనవైపే మొగ్గు చూపిస్తోంది. 2009, 2014లో ఆయన రెండు సార్లు పెదకూరపాడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో అక్కడ భాష్యం ప్రవీణ్‌కు అవకాశం కల్పించారు.

News December 17, 2025

అనంత: సూరీడు సమయం మారిపోతోంది.!

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ప్రభావంతో ప్రజలు గజ గజ వణుకుతున్నారు. దానికి తోడు ఉదయం 8.30 గంటలవుతున్నప్పటికీ పొగ మంచు కప్పి వేయడంతో సూర్య భగవానుడు సైతం కనిపించని పరిస్థితి నెలకొంటుంది. వాహనదారులు పొగ మంచు పూర్తిగా క్లియర్ అయిన తర్వాత ప్రయాణాలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో సూర్యోదయం దృశ్యాలను చూడొచ్చు.