News February 10, 2025

ఎండపల్లి: ఉరేసుకున్న యువతి

image

ఉరేసుకుని ఓ యువతి <<15412992>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఐ ఉమా సాగర్ తెలిపిన వివరాల ప్రకారం..ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన శ్రావణి(23) చదువు రావడంలేదు అని, తను తల్లిదండ్రులకు భారం కావద్దని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News July 5, 2025

BREAKING: HYD: వికారాబాద్ విహారయాత్రలో మహిళలు మృతి

image

HYD నుంచి విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు మహిళలు శనివారం మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ మండలం సర్పన్‌పల్లి ప్రాజెక్టు సమీపంలోని వెల్డర్‌నెస్ రిసార్ట్‌కు HYDకు చెందిన రీటా కుమారి(55), పూనమ్ సింగ్(56) వచ్చారు. విహారయాత్రలో భాగంగా ఈరోజు సా.5 గంటలకు ప్రాజెక్టులో బోటింగ్ చేస్తుండగా బోట్ ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ప్రమాదంలో వారిద్దరూ చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

News July 5, 2025

విపత్తుల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సంసిద్ధం: నల్గొండ కలెక్టర్

image

విపత్తుల నిర్వహణకు నల్గొండ జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ అధికారులకు తెలిపారు. శనివారం అథారిటీ అధికారుల బృందం జాయింట్ అడ్వైజర్ నావెల్ ప్రకాశ్, అండర్ సెక్రటరీ అభిషేక్ బిశ్వాల్, వసీం ఇక్బాల్ బృందం రాష్ట్ర విపత్తుల నిర్వహణ అధికారి గౌతమ్ ఆధ్వర్యంలో నల్గొండ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్‌ను కలిశారు.

News July 5, 2025

దోమల నివారణకు ఇలా చేయండి

image

TG: వర్షాకాలంలో దోమల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇంటి పరిసరాల్లో నీరు నిలువకుండా చూసుకోవాలి. వాటర్ ట్యాంకులు మూతలు పెట్టి ఉంచాలి. పూల కుండీల కింద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వాడకంలోలేని టైర్లు, పనిముట్లు బహిరంగ ప్రదేశాల్లో ఉంచొద్దు. వీటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా రాకుండా నివారించవచ్చని పేర్కొంది.