News April 7, 2025

ఎండలతో జాగ్రత్త!

image

కర్నూలు జిల్లాలో నేటి నుంచి క్రమంగా ఎండతీవ్రత పెరగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 41-43°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా నిన్న జిల్లాలోని కామవరంలో అత్యధికంగా 40.8°C ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News April 14, 2025

అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి: కర్నూలు కలెక్టర్

image

వెల్దుర్తి బాలుర వసతి గృహంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.  దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానమని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎమ్మార్వో, ఆర్డీవో, వార్డెన్ తదితరులు పాల్గొన్నారు.

News April 14, 2025

కర్నూలులో నేడు PGRS రద్దు

image

కర్నూలులో నేడు నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేశామని వివరించారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మరోవైపు ఎస్పీ కార్యాలయంలోనూ ఈ కార్యక్రమం జరగదని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.

News April 14, 2025

టీటీడీ గోశాల‌పై అసత్య ప్ర‌చారాలు: మంత్రి TB

image

కోట్లాదిమంది ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా టీటీడీపై వైసీపీ నేత భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి మాట్లాడ‌టం త‌గ‌ద‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం శాఖ మంత్రి టీజీ భ‌రత్ అన్నారు. ఆవుల మ‌ర‌ణాల‌పై భూమ‌న వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ ఆదివారం మంత్రి టీజీ భ‌ర‌త్ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తీతీదే ప‌విత్ర‌త‌ను కాపాడేందుకు ఎన్డీయే ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో కృషి చేస్తోంద‌న్నారు.

error: Content is protected !!