News April 7, 2025
ఎండలతో జాగ్రత్త!

శ్రీ సత్యసాయి జిల్లాలో నేటి నుంచి క్రమంగా ఎండతీవ్రత పెరగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 41-43°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో తరచూ నీరు తాగాలని అన్నారు. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Similar News
News April 9, 2025
అధికారులు సమస్యలను వెంటనే పరిష్కరించాలి: కడియం

దేవాదుల ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్ అని స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులు పంటలు ఎండిపోయి ఇబ్బందులు పడుతుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అధికారులు సమస్యలను వెంటనే గుర్తించి వాటిని పరిష్కరించాలని సూచించారు.
News April 9, 2025
రాష్ట్ర పండుగగా అంబేడ్కర్ జయంతి: అనకాపల్లి కలెక్టర్

అంబేడ్కర్ జయంతిని ఈనెల 14వ తేదీన రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్లు అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం నెహ్రూ చౌక్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తామన్నారు. అనంతరం గుండాల వద్ద శంకరన్ సమావేశ మందిరంలో జయంతి ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
News April 9, 2025
పెద్దపల్లి: విద్యుత్తు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండండి: SE

పెద్దపల్లి సర్కిల్ విద్యుత్ శాఖ SE మాధవ రావు వర్షాకాలంలో సంభవించే ప్రమాదాలు అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. విద్యుత్ స్తంభాలకు తీగలు కట్టి బట్టలు ఆరవేయద్దన్నారు. తడిసిన స్తంభాలు, సపోర్ట్, స్టే వైర్ తాకకూడదు. వ్యవసాయ బావులు, గృహోపకరణాలు తదితర అవసరాలకు అతుకులు లేని వైర్లను వాడాలి. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సిబ్బందిని లేదా టోల్ ఫ్రీ నంబర్ 1912ని సంప్రదించాలన్నారు.