News July 6, 2025
ఎండాడ వద్ద రోడ్డు ప్రమాదం.. బూర్జ మండల వాసి మృతి

ఎండాడ వద్ద RTC బస్సు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో శ్రీకాకుళం(D) బూర్జ(M) ఉప్పినివలసకు చెందిన వెంకటరమణమూర్తి(45) మృతి చెందాడు. PMపాలెం CI బాలకృష్ణ వివరాల ప్రకారం.. రమణమూర్తి భార్య, పిల్లలతో కలిసి విశాఖలో ఉంటున్నాడు. శనివారం RDO ఆఫీసుకి వెంకట్రావుతో కలిసి రమణమూర్తి శ్రీకాకుళం వెళ్లారు. తిరిగి వస్తుండగా ఎండాడ వద్ద బస్సును ఓవర్‌టేక్ చేసే సమయంలో ప్రమాదం జరిగి రమణమూర్తి చనిపోగా వెంకట్రావు గాయపడ్డాడు.
Similar News
News July 6, 2025
శ్రీకాకుళం జిల్లాలో యువకుడు దారుణ హత్య

కొత్తూరు మండలం వసప గ్రామ సమీపంలో అర్ధరాత్రి వేళ ఘోర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లుకలాపు మిన్నారావు (21) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ చింతాడ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.
News July 6, 2025
టెక్కలిలో నకిలీ సిగరెట్ల కలకలం!

టెక్కలిలో నకిలీ సిగరెట్లు కలకలం రేపాయి. ఒరిస్సా నుంచి విచ్చలవిడిగా వస్తున్న ఈ సిగరెట్లు టెక్కలి మార్కెట్‌లో చాప కింద నీరులా విస్తరించాయి. ప్రధాన సిగరెట్ల కంపెనీలను పోలి ఉన్న వీటిని ఇటీవల కంపెనీ ప్రతినిధులు గుర్తించారు. వీటి ద్వారా ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. ఒరిస్సా నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా టెక్కలితో పాటు శ్రీకాకుళం, విశాఖకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
News July 6, 2025
శ్రీకాకుళం: అతని నేత్రాలు సజీవం

శ్రీకాకుళం నగరంలోని డీసీసీబీ కాలనీకి చెందిన పడాల. నారాయణ రావు(84) శనివారం మృతి చెందారు. అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ జగన్మోహన్ రావుకు తెలియజేశారు. డాక్టర్ కె.సుదీర్ పర్యవేక్షణలో మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ సుజాత, చిన్ని కృష్ణ ద్వారా అతని కార్నియాలు సేకరించారు. విశాఖపట్నం ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.