News May 4, 2024
ఎండీ కావ్య కావాలి.. కడియం కావ్య ఎలా అవుతుంది?: ఆరూరి

హన్మకొండ జిల్లా దామెరలో నిర్వహించిన ప్రచారంలో వరంగల్ BJP ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్.. కడియం కావ్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి ఎమ్మెల్యే, బిడ్డ ఎంపీనా? ఇవేమైనా రాజరికమా అని ఎమ్మెల్యే కడియంను ఉద్దేశించి మాట్లాడారు. ముస్లింను పెళ్లి చేసుకున్న ఆమె కడియం కావ్య ఎలా అవుతుందని, ఎండీ కావ్య అవుందని మండిపడ్డారు. NTR, KCR, చంద్రబాబులను వెన్నుపోటు పొడిచిన ఘనత కడియం శ్రీహరిదన్నారు.
Similar News
News April 22, 2025
INTER RESULTS.. వరంగల్‌లో ఎంత మంది పాస్ అయ్యారంటే?

ఇంటర్ ఫలితాల్లో వరంగల్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 5,401 మంది పరీక్షలు రాయగా 3,709 మంది ఉత్తీర్ణత సాధించారు. 68.67 పాస్ పర్సంటేజీ వచ్చింది. ఫస్ట్ ఇయర్‌లో 5,814 మందిలో 3,368 మంది ఉత్తీర్ణులు కాగా.. 57.93 పాస్ పర్సంటేజీ నమోదైంది.
News April 22, 2025
వరంగల్: తేలనున్న 12,321 మంది విద్యార్థుల భవితవ్యం!

వరంగల్ జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో ఈ ఏడాది 12,321 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. మొదటి సంవత్సరం జనరల్‌లో 4,967 మంది, ఒకేషనల్- 848, ద్వితీయ సంవత్సరం జనరల్-5,739, ఒకేషనల్ 767 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను వేగంగా Way2News యాప్‌లో చూసుకోవచ్చు. #SHARE IT
News April 22, 2025
ములుగు జిల్లాలో దారుణం.. వ్యక్తి హత్య!

ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడం సాయి ప్రకాశ్ ఈ నెల 15న హనుమకొండలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. పోలీసులు విచారణ చేపట్టగా ఓ కానిస్టేబుల్ సుపారి గ్యాంగ్‌తో కలిసి సాయి ప్రకాశ్‌ను హత్య చేసినట్లు తెలిసింది. మండలంలో ఎంతోమంది గర్భిణులకు, దివ్యాంగులకు, వృద్ధులకు, ఆదివాసులకు సేవ చేసిన సాయి ప్రకాశ్ మృతితో మండలంలో విషాదం నెలకొంది.