News January 5, 2026
ఎండోమెట్రియోసిస్‌తో క్యాన్సర్ ముప్పు

ఎండోమెట్రియోసిస్ ఉన్న మహిళలకు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎండోమెట్రియాయిడ్ కార్సినోమా, క్లియర్ సెల్ కార్సినోమాను అభివృద్ధి చేస్తుందంటున్నారు. వీటిని గుర్తించేందుకు MRI/అల్ట్రాసౌండ్ చేస్తారు. రిపోర్ట్స్‌లో అసాధారణ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే.. శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించాల్సి ఉంటుంది. జీవనశైలి మార్పులు చేసుకుంటే ఈ ముప్పును తగ్గించొచ్చని చెబుతున్నారు.
Similar News
News February 6, 2026
నెహ్రూలా మోదీ చేయలేదు: నిర్మలా సీతారామన్

ఆర్మీ మాజీ చీఫ్ నరవణెతో ప్రభుత్వానికి ఎలాంటి సమస్య లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆయన్ను తాము గౌరవిస్తామని చెప్పారు. నరవణె <<19052501>>పుస్తకాన్ని<<>> నిషేధించలేదని, రక్షణ శాఖ ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదని తెలిపారు. ‘‘మీకు కరెక్ట్ అనిపించింది చేయండని సాయుధ దళాలకు మోదీ స్వేచ్ఛనిచ్చారు. ‘అరుణాచలీస్.. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి’ అని నెహ్రూ చెప్పినట్లుగా ప్రధాని చేయలేదు’’ అని విమర్శించారు.
News February 6, 2026
తెలంగాణలో 336 వార్డుల్లో జనసేన పోటీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డుల్లో తమ పార్టీ పోటీ చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ADB, నల్గొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో తమ అభ్యర్థులు బరిలో ఉంటారని పేర్కొంది. ఇప్పటికే B-ఫారమ్స్ దాఖలు చేయగా, రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను ఆమోదించారని తెలిపింది. వీరంతా గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్నట్లు వివరించింది.
News February 6, 2026
క్లాడ్ 4.6 ఓపస్: పనులన్నీ చిటికెలో.. IT ఉద్యోగుల ఆందోళన ఇదే..

ఆంథ్రోపిక్ కొత్తగా రిలీజ్ చేసిన Claude Opus 4.6 మోడల్ ప్రొఫెషనల్ పనుల కోసం డిజైన్ చేశారు. ఇది కాంప్లెక్స్ కోడింగ్‌ను సెకన్లలో డీబగ్ చేస్తుంది. భారీ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులను ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. వేల పేజీల డాక్యుమెంట్లను సెకన్లలో రీసెర్చ్ చేస్తుంది. ఫైనాన్షియల్ అనాలసిస్, ఎక్సెల్ షీట్లు, ప్రజెంటేషన్లను తయారు చేయడంలో ఇది దిట్ట. దీని రాకతో IT రంగంలో జాబ్స్ పోతాయంటూ <<19066930>>ఆందోళన<<>> వ్యక్తమవుతోంది.


