News February 7, 2025
ఎంపీటీసీ ఎన్నికలు: సిద్దిపేట జిల్లా పూర్తి వివరాలు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 4, మున్సిపాలిటీలు 5, జీపీలు 504 ఉన్నాయి. ఇదిలా ఉంటే ZPTC-26, MPP-26, MPTC- 230 ఉన్నాయి. గతంలో 229గా ఉన్న MPTC సంఖ్యను ప్రస్తుతం 230కు అధికారులు పెంచారు. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండటంతో గ్రామాల్లో ప్రస్తుతం సందడి నెలకొంది.
Similar News
News February 7, 2025
మరోసారి SA20 ఫైనల్‌కు సన్‌రైజర్స్
‘SA20’లో ఎలిమినేటర్‌లో పార్ల్ రాయల్స్‌పై గెలిచి సన్‌రైజర్స్(SEC) ముచ్చటగా మూడోసారి ఫైనల్ చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ 175/4 స్కోరు చేసింది. రూబిన్(81), ప్రిటోరియస్(59) రాణించారు. ఛేజింగ్‌లో SEC ఓపెనర్ జోర్జీ(78), జోర్డాన్(69) తడబడకుండా ఆడారు. ఫైనల్లో ముంబై ఇండియన్స్ కేప్‌టైన్(MICT)తో రేపు రాత్రి 9గంటలకు సన్‌రైజర్స్ తలపడనుంది. మార్క్రమ్ సేన తొలి రెండు సీజన్లు కప్ కొట్టిన సంగతి తెలిసిందే.
News February 7, 2025
వాట్సాప్‌లో ఇంటర్ హాల్‌టికెట్లు.. టెన్త్ కూడా
AP: ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్లు నిలిపివేసే ఘటనలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇంటర్ హాల్‌టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని నిర్ణయించింది. 9552300009 నంబర్ ద్వారా విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలో టెన్త్ విద్యార్థులకు సైతం ఇదే అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఇంటర్ ప్రాక్టికల్స్ ఈ నెల 10-20 వరకు, పరీక్షలు మార్చి 1-20 వరకు జరుగుతాయి.
News February 7, 2025
గ్రూప్-1 ఫలితాలపై UPDATE
TG: రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఆన్సర్ షీట్ల మూల్యాంకనం ముగిసింది. మరో 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించేందుకు TGPSC కసరత్తు చేస్తోంది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా ఉండనుంది. ఈ పరీక్షలకు 21,093 మంది హాజరైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్-2, 3 ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. బ్యాక్‌లాగ్‌లు లేకుండా ఉండేందుకు ఇలా చర్యలు తీసుకుంటోంది.