News December 25, 2024
ఎంపీని కుంభమేళాకు ఆహ్వానించిన సిద్ధయోగి

ఎంపీ వద్దిరాజు రవిచంద్రను స్వామి హిమాలయ తపస్వి శ్రీస్వామి సిద్ధ యోగి కలిసి మహా కుంభమేళాకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. సిద్ధ యోగి మంగళవారం సాయంత్రం ఎంపీ రవిచంద్రను హైదరాబాద్లోని నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. భారతీయులు పరమ పవిత్రంగా భావించే గంగా నదిలో 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళ జరుగుతుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మేళా జరుగుతుందని వారు తెలిపారు.
Similar News
News November 6, 2025
పోష్, పోక్సో చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: ఇన్చార్జ్ కలెక్టర్

పోష్ చట్టం-2013, పోక్సో చట్టం-2012లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ శ్రీజ అన్నారు. గురువారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగ స్థలాల్లో మహిళల రక్షణకు పోష్ చట్టం పొందించబడిందని, దీని కింద 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని సూచించారు. పిల్లల రక్షణకు పోక్సోలో కఠిన శిక్షలు ఉన్నాయని తెలిపారు.
News November 6, 2025
ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను చేరుకోవాలి: అదనపు కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ఆయిల్ పామ్ పంట శిక్షణ కార్యక్రమంలో అ. కలెక్టర్ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణ లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు. ఆయిల్ పామ్ రైతులకు అధిక లాభాలను అందిస్తుందని, ఎటువంటి నష్టం సంభవించదని తెలిపారు. రైతులకు అంతర్ పంటల ద్వారా కూడా ఆదాయం లభిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఉద్యానవన అధికారి మధుసూదన్ పాల్గొన్నారు.
News November 6, 2025
ఖమ్మం: స్కూటీ రిపేర్ చేయలేదని షో రూమ్‌కు తాళం

ఖమ్మంలో గురువారం వినూత్న ఘటన జరిగింది. తన ఎలక్ట్రికల్ స్కూటీని రిపేర్ చేయలేదన్న కారణంగా ఓ వ్యక్తి ఏకంగా షోరూమ్‌కు తాళం వేశాడు. బోనకల్ మండలం రావినూతలకి చెందిన కొమ్మినేని సాయి కృష్ణ నాలుగు నెలల క్రితం స్కూటీ కొనుగోలు చేశారు. రిపేరు రావడంతో షోరూమ్ సిబ్బందిని సంప్రదించగా, అది తమ పరిధిలో రిపేరు కాదని వారు తెలిపారు. దీంతో అసహనానికి గురైన సాయి కృష్ణ ఆ షోరూమ్‌కు తాళం వేసినట్లు సమాచారం.


