News July 1, 2024
ఎంపీ కారుపై రాళ్ల దాడి.. ఎంపీపీ భర్తపై కేసు నమోదు

ఏ.కొండూరు మండలం కంభంపాడులో పోలింగ్ జరిగిన రోజున ఎంపీ కేశినేని చిన్ని కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనపై తిరువూరు MLA కొలికపూడి శ్రీను తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. MLA ఫిర్యాదు మేరకు రాళ్ల దాడికి పాల్పడ్డ ఎంపీపీ నాగలక్ష్మి భర్త చెన్నారావు, రామకృష్ణ, శివకృష్ణతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఏ.కొండూరు పోలీసులు తెలిపారు.
Similar News
News February 20, 2026
కృష్ణా: నిందితులపై పోలీసుల ఫోకస్..!

కృష్ణాజిల్లాలో కరుడుగట్టిన నేరస్తులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. SP విద్యాసాగర్ ఆదేశాల మేరకు నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. హత్యలు, అత్యాచారాలు, ఇతర నేరాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతంగా మారిన వారి పట్ల చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు వివరించారు. ఇటువంటి వారికి PT వారెంట్ల జారీకి కూడా వెనుకాడటం లేదని, తాజాగా పెనమలూరు PS పరిథిలోని నిందితుడు KTM పండుకు PT వారెంట్ జారీ చేశారన్నారు.
News February 19, 2026
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

వసతి గృహాల్లో అంటి వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు: కృష్ణా కలెక్టర్
* ఇన్‌స్టా పరిచయం.. ఝార్ఖండ్ నుంచి బందరుకు వివాహిత
* కృష్ణాలో బెల్ట్ షాపుల జోరు.. మామూళ్ల హోరు.!
* మచిలీపట్నం: బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి
* విజయవాడ గాంధీ హిల్స్‌లో యువత వెకిలి చేష్టలు.!
* కృష్ణా : పది పరీక్షలకు 297 కేంద్రాలు.. 61 సమస్యాత్మక కేంద్రాలు
News February 19, 2026
వసతి గృహాల్లో అంటు వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్

సంక్షేమ వసతి గృహాల్లో అంటువ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్‌లో అంతర్ శాఖల ఉమ్మడి తనిఖీ కమిటీ సమావేశం జరిగింది. అంటువ్యాధుల ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. వసతి గృహాలను నిరంతరం తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డా. యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.


