News August 17, 2025

ఎంపీ కేశినేనిని కలిసిన ఎమ్మెల్యే శిరీష

image

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదివారం విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్‌లో ఎంపీ కేశినేని శివనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ (ఏసీఏ) అధ్య‌క్షుడిగా ఎన్నికైన సంద‌ర్భంగా ఎంపీకి పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం ఎమ్మెల్యే గౌతు శిరీషను ఎంపీ శాలువాతో సత్కరించి, కొండ‌ప‌ల్లి బొమ్మ‌ను బహుకరించారు.

Similar News

News August 17, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤టెక్కలి: జాతీయ రహదారిపై ఢీకొన్న వాహనాలు
➤SKLM: తుఫాన్ కంట్రోల్ రూంలు ఏర్పాటు
➤ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: అచ్చెన్న
➤ జిల్లా వ్యాప్తంగా వర్షాలు..పలుచోట్ల వరి పంట ముంపు
➤పాతపట్నం: మూడు నెలలుగా తాగునీటికి ఇబ్బందులు
➤ నాగావళి నదిలో వృద్ధుడు గల్లంతు
➤హిరమండలం: గొట్టా బ్యారేజ్‌కు భారీగా చేరుతున్న నీరు
➤ టెక్కలి: డీజిల్ ట్యాంకర్ బోల్తా..తప్పిన ప్రమాదం

News August 17, 2025

శ్రీకాకుళం జిల్లాలోని పాఠశాలలకు రేపు సెలవు

image

శ్రీకాకుళం జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సోమవారం కలెక్టర్ సెలవు ప్రకటించారు. వాయుగుండం ప్రభావం వల్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓ‌లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ ఆదేశాలు పాటించాలని సూచించారు. రేపటి సెలవు దినాన్ని మరో రోజు పనిచేయవలసి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

News August 17, 2025

జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాలి: మంత్రి అచ్చెన్న

image

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావం కారణంగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని అచ్చెన్నాయుడు అధికారులను సూచించారు. ఈ మేరకు నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని నాగావళి, వంశధార, మహేంద్రతనయ వంటి నదుల తీరంలో ఉన్న గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.